మ‌న దేశానికి అలాగే పాకిస్థాన్ కు ఉన్న రాజ‌కీయ, భూ బాగ వివాదాల వ‌ల్ల చాలా సంవ‌త్స‌రాల నుంచి ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు తో మ‌న దేశం క్రికెట్ ఆడ‌టం లేదు. ఐసీసీ వేదిక‌లు కాకుండా ద్వై పాక్షిక మ్యాచ్ లు చాలా ఏళ్ల నుంచి జ‌ర‌గ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే వ‌రల్డ్ క‌ప్ పోటీల‌లో మాత్ర‌మే త‌ల‌ప‌డుతున్నాయి. అయితే టీ ట్వంటి వ‌రల్డ్ క‌ప్ సంద‌ర్బం గా టీమిండియా పాక్ జ‌ట్టు తో ఢీ కోట్ల బోతుంది. ఈ మ్యాచ్ దుబయ్ వేదిక‌గా ఈ ఆది వారం జ‌ర‌గ బోతుంది. అయితే ఈ మ్యాచ్ పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ఆడి దాయాది జ‌ట్టు ను ఓడించాల‌ని కొంత మంది అంటున్నారు. అలాగే క్రికెట్ లోనూ పాక్ కంటే భార‌త్ దృఢంగా ఉంద‌ని నిరుపించాల‌ని అంటున్నారు. అయితే మ‌రి కొంత మంది మ‌రొలా డిమాండ్ చేస్తున్నారు.




పాకిస్థాన్ మ‌న స‌రిహ‌ద్దు వెంబ‌డి హింస ను ప్రేరేపించేలా ప్ర‌వ‌ర్తిస్తే మ‌నం వారితో క్రికెట్ ఎలా ఆడాలి అని ప్ర‌శ్నిస్తున్నారు. పాకిస్థాన్ ను అంత‌ర్జాతీయంగా ఓంట‌రిని చేయాలని అంటున్నారు. క్రికెట్ లో ను పాక్ ను ఓంట‌రి చేసి వారు చేస్తున్న కుట్ర ల‌ను ప్రపంచానికి చెప్పాల‌ని అంటున్నారు. అలాగే ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక న కూడా ఇండియా పాక్ క్రికెట్ గురించి పోస్టు లు పెడుతున్నారు. ఈ డిమాండ్ ను సామ‌న్యు లే కాకుండా రాజ‌కీయ నాయకులు సైతం చేస్తున్నారు. ఇటీవ‌ల ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కూడా ఈ మ్యాచ్ విష‌యం లో త‌న అభిప్రాయాన్ని చెప్పాడు. పాక్ చ‌ర్య‌ల వ‌ల్ల మ‌న దేశ సైనికులు చ‌ని పోతుంటే వారి తో మ‌నం క్రికెట్ ఆడాల అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ని ప్రశ్నించారు.




అలాగే ఇదే విష‌యం పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా స్పందించాడు. ఈ మ్యాచ్ విష‌యంలో మ‌రో సారి ఆలోచించాల‌ని అన్నాడు. తాజాగా మ‌రో కేంద్ర మంత్రి కూడా ఈ మ్యాచ్ ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. తాజా గా ఆయ‌న ఒక ప్ర‌యివేటు ఛాన‌ల్ లో  ఈ మ్యాచ్ గురించి మాట్లాడారు. పాక్ తో మంచి సంబంధాలు పెంచు కోవాల‌ని త‌మ ప్ర‌భుత్వం చాలా ప్ర‌య‌త్నించింది అని అన్నాడు. కానీ పాక్ త‌న వ‌క్ర బుద్ది వ‌ల్ల‌ రెండు దేశాల మ‌ధ్య స్నేహ సంబంధాలు  మెరుగు ప‌డ‌లేద‌ని అన్నారు. కాశ్మీర్ విష‌యంలో ప్ర‌తి సారి పాక్ త‌ల‌దూర్చి మ‌న‌ల్ని రెచ్చ‌గొటుతుంద‌ని తెలిపారు. ఆలాంటి దేశంతో మ‌న దేశం క్రికెట్ ఆడటానికి వీలు లేద‌ని అన్నారు. ఈ మ్యాచ్ ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని మోడీ కోరుతాన‌ని కూడా తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: