వచ్చే ఎన్నికల్లో ఏపీ లో బీజేపీ అధికారంలోకి రానుందా..? టీడీపీతో పొత్తుపై పెద్దలు చెబుతున్నది ఏమిటి..? ఎన్నికల్లో ఏ వ్యూహం అమలు చేయాలని కమలనాథులు సూచిస్తున్నారు..? 2024 లో ఏపీలో అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా ముందుకు వెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఓ వైపు అధికార వైసిపి ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడాలని, టిడిపితోనూ సమానదూరం పాటించాలని చెప్పిన ఆయన తర్వాత అంతర్గతంగా జరిగిన సమావేశంలో టీడీపీ కి బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారని సమాచారం.

ముఖ్యంగా టీడీపీ కి వ్యతిరేకంగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు గట్టిగా క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార వైసిపి తో కేంద్రం సత్సంబంధాలు కొనసాగిస్తోందని, అదే సమయంలో టీడీపీ తో అవసరాన్ని బట్టి తర్వాత చూద్దానే ధోరణిలో వెళ్తున్నట్టు ప్రచారం ఉంది. ఈ అనుమానాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రెండు పార్టీలతో ఎలా వ్యవహరించాలి అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రజావ్యతిరేకత పెరిగిందని, ఖచ్చితంగా వైసీపీ తీరుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దీనికితోడు జనసేనతో పోత్తుందని ఆ పార్టీ తో కలిసి అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. అయితే బహిరంగ సమావేశంలో ఈ మాటలన్న అమిత్ షా తర్వాత అంతర్గత సమావేశంలో పార్టీ స్ట్రాటజీ పై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమయం లో టీడీపీ తో పొత్తుకన్నా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తామన్న దానిపై వారికి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. పొత్తు కన్నా ముందు పార్టీ బలోపేతం కావాలన్నది అమిత్ షా సూచనగా తెలుస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్ తో సహా మిగతా పార్టీలను కలుపుకొని  బిజెపిని ఎదుర్కొనేందుకు విఫలయత్నం  చేశాడు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి వైఖరిలో మార్పు వచ్చేసింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం బీజేపీతో పొత్తు కోసం టిడిపి తహతహలాడుతోంది.

ఆ తర్వాత టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఇదే విషయాన్ని అమిత్ షా  ను కలిసి ప్రస్తావించగా తర్వాత కలుద్దాం అని చెప్పి పంపేశారు. ఇప్పుడు అమిత్ షా  రాష్ట్రానికే వచ్చారు .అయినా చంద్రబాబు గాని, టీడీపీ గాని నోరేత్తడం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలకు తిరుపతిలో దిశనిర్దేశం చేసిన అమిత్ షా టిడిపితో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: