చిత్తూరు రాజ‌కీయాలు చంద్ర‌బాబుకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీ ప‌గ్గాలు అందుకునే వారు లేక చాలా కాలంగా ఇబ్బందులతోనే న‌డుపుతూ వ‌స్తున్నారు అధినేత. స‌రైన స‌మ‌యంలో స‌రైన నాయ‌క‌త్వం లేక పార్టీ త‌ర‌ఫున అధికార పార్టీని
అడిగి నిల‌దీసే శ‌క్తులు లేక చేదు అనుభ‌వాలే అందుకుంటున్నారు. దీంతో పార్టీకి కొత్త జ‌వం జీవం పోసేవారు కోసం వెతుకులాట‌లో ఉన్నారు చంద్ర‌బాబు. కుప్పం ఫ‌లితాలతో ఇప్ప‌టికీ కోలుకోలేని స్థితిలో ఉన్న అధినేత అక్క‌డి నాయ‌కుల‌ను న‌మ్ముకోలేక, తానే అక్క‌డ ఉండి రాజ‌కీయం చేయ‌లేక త‌న త‌ర‌ఫున ఎవ్వ‌రినీ నియ‌మించ‌లేక అవ‌స్థ‌ప‌డుతున్నారు.


వైసీపీ పాతుకుపోయిన ప్ర‌తిచోటా టీడీపీ మ‌నుగ‌డ ఏంట‌న్న‌ది తెలియ‌డం లేదు. అలాంటి ఇబ్బంది వ‌చ్చిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబు సీన్ లోకి రావ‌డం మిన‌హా స్థానిక నాయ‌క‌త్వాలు లేకుండా పోతున్నాయి. మొన్న‌టి దాకా వైసీపీకి ఇలాంటి ఇబ్బందే ఉండేది. కానీ అధికారంలోకి వ‌చ్చాక ఏదో ఒక ప్ర‌యోజ‌నం కోరి పార్టీ కోసం ప‌నిచేయ‌డం ప్రారంభించారు దిగువ స్థాయి నాయ‌కులు. జ‌గ‌న్ కూడా అలానే కొద్దో గొప్పో ఉన్నంత‌లో  ఏదో ఒక ప‌ద‌వి ఇచ్చి సంతృప్తి ప‌రిచారు. ఇదే స‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగినా కూడా వైసీపీ హ‌వాకు టీడీపీ అడ్డు చెప్ప‌లేక‌పోయింది. ఫ‌లితంగా అన్నింటా కూడా ఘోరం అయిన ప‌రాజ‌యాన్నే పొందింది. టీడీపీకి ఒక‌ప్పుడు మైలేజ్ ఉన్న చోట్ల కూడా వైసీపీ త‌న జెండా ఎగుర‌వేసేందుకు అధికారం, అర్థ‌బ‌లం ఉప‌యోగించుకుంది. కానీ అంతటి స్థాయిలో అధికార పార్టీకి ఉన్నంత స్థాయిలో టీడీపీ కి పై రెండు బ‌లాలూ లేవు. పార్టీని న‌డిపే శ‌క్తి కోసం ఎదురు చూడ‌డం త‌ప్ప మ‌రో దిక్కేలేదు చిత్తూరు టీడీపీకి.


చిత్తూరు టీడీపీకి విచిత్ర‌మ‌యిన ఇబ్బందులే ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో మాదిరి కాకుండా ఇప్పుడు పార్టీ ఇంటా బ‌య‌టా త‌ల నొప్పులు ఎదుర్కొంటోంది. కాలం క‌ల‌సి రాక ఇంఛార్జులు లేక అవ‌స్థ ప‌డుతున్న నేప‌థ్యంలో పార్టీకి అండ‌గా నిలిచే పెద్ద దిక్కు కో సం అంతా ఎదురు చూపులు చూస్తున్నారు. ఓ వైపు అకాల వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. మ‌రోవైపు ఇళ్లు కూలి చాలా మంది రో డ్డున ప‌డి దిక్కు తోచ‌క సాయం ప్ర‌భో అని అర్థిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కూడా జ‌నం త‌ర‌ఫున మాట్లాడేవారు, అధికార ప‌క్షాన్నివిమ‌ర్శించే వారు లేకుండా పోతున్నారు. అడిగే నాథుడు లేక టీడీపీ త‌ర‌ఫున మాట్లాడే వారు లేక అధికార పార్టీ రెచ్చిపో యి రంకెలేస్తుంద‌న్న వాద‌న ఒక‌టి ప‌సుపు పార్టీ  అభిమానుల నుంచి వినిపిస్తోంది. దీంతో కొద్దో గొప్పో పార్టీ త‌ర‌ఫున మాట్లాడ‌డం చేత‌న‌యిన వారు కూడా త‌మ‌కెందుకులే అని మిన్న‌కుండిపోతున్నారు. ఈ ద‌శ‌లో పార్టీ మ‌నుగ‌డ అన్న‌ది క‌ష్టంగానే మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: