ఏపీలో వైసిపి గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలిచి తిరుగులేని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వారిలో చాలా మంది రాజకీయాలతో సంబంధం లేని వారే. జగన్ ఎన్నికలకు ముందు చాలా మంది కొత్త వారికి సీటు ఇవ్వడంతో వారంతా జగన్ ప్రభంజనంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోయారు. అయితే వీరికి రాజకీయ ఓనమాలు తెలియవు. వీరిలో చాలామంది పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు గా గెలిచిన రెండు మూడు నెలల నుంచి రిలాక్స్ అయిపోయారు.

మరో వైపు రెండు సంవత్సరాల వరకు వీరిలో చాలా మందికి జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. తమ తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులకు కూడా ఎవరిని కలవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనికి తోడు కరోనా రావడంతో రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేల్లో చాలామంది ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వీరిలో చాలామంది తీవ్రమైన వ్యతిరేకత తో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వారికి సీటు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది.

అటు జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న పనులకు కూడా నిధులు ఇవ్వటం లేదు. మరోవైపు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఇక్కడ చూస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది... రేపు జగన్ సర్వే చూపించి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తారో ఇవ్వ‌రో తెలియ ని పరిస్థితి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ ప్ర‌తిప‌క్షం లో ఉండ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు న‌చ్చిన వారికే సీటు ఇచ్చారు.

అయితే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండ‌డంతో చాలా నియోజ‌క‌వ‌ర్గా ల్లో సీట్ల కోసం పోటీ మొద లు అయ్యింది. డ‌బ్బున్న నేత‌లు కూడా రంగంలోకి దిగారు. ఇన్ని సందిగ్ధ‌ పరిస్థితుల మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలవిల్లాడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: