
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 1350 నమోదు అయితే అవి మ న దేశంలోనే ఏకంగా 24 నమోదు అయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ చాలా మంది ప్రజలు నిబంధనలను పక్కన పెట్టి జీవిస్తున్నారు. ఇంకా మన దేశంలో వ్యాక్సిన్ వేయించుకోని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరోవైపు ఈ కొత్త వేరియంట్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వచ్చేస్తుందన్న చర్చలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
మరోసారి మన దేశంలో లాక్ డౌన్ తప్పదన్నా చర్చలు కూడా వినిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ఉంటుందన్న ప్రచారంపై సీఎం కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని చెప్పిన ఆయన కొత్త వేరియంట్ గురించి ఎవరు భయపడాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు తాను సమీక్షిస్తున్నట్టు కేజ్రీ చెప్పారు.
అయితే ప్రజలు మాత్రం కరోనా తమకు రాదన్న ధీమా తో కాకుండా.. నిత్యం మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా మన దేశంలో ప్రజల్లో కూడా మళ్లీ నిర్లక్ష్యం అయితే వచ్చేసింది. ఈ సారి థర్డ్ వేవ్ వస్తే ఆ దెబ్బ మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి ఇప్పటకి అయినా ఈ నిర్లక్ష్యం మనోళ్లు వీడతారేమో ? చూడాలి.