మొన్నటివరకు టీఆర్ఎస్‌కు పట్టిందల్లా బంగారం అనే పరిస్తితి...కానీ గత కొంతకాలం నుంచి పట్టుకుంటే ప్రతిదీ బొగ్గే అన్నట్లు ఉంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు తిరుగులేదనే పరిస్తితి. వరుసగా అధికారంలో కొనసాగుతూ...ప్రతిపక్షాలని తొక్కుతూ కేసీఆర్ ఎదుగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..అసలు ప్రజలే టీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో ఉన్నారో లేక ప్రతిపక్షాలకు కూడా ఇంకో అవకాశం ఇవ్వాలని అనుకున్నారో తెలియదు గానీ..ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు పుంజుకునే పరిస్తితి.

ముఖ్యంగా ఈటల రాజేందర్ లాంటి నేత బీజేపీలో చేరడం టీఆర్ఎస్‌కు బాగా మైనస్ అయింది. అదే బీజేపీకి ప్లస్ అయింది. అలాగే కారు పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ లాంటి జిల్లాలో బీజేపీకి అవకాశం దొరికనట్లైంది. ఎందుకంటే కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడం అంత సులువు కాదు...జిల్లాపై టీఆర్ఎస్‌కు పూర్తి పట్టు ఉంది. జిల్లాలో 13 సీట్లు ఉంటే టీఆర్ఎస్‌కు 12 సీట్ల బలం ఉండగా, అలాగే కాంగ్రెస్‌కు ఒక సీటు బలం ఉంది. అయితే ఈటల ఎప్పుడైతే టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరి...హుజూరాబాద్‌లో మళ్ళీ గెలిచారో అప్పటినుంచి టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. జిల్లాలో టీఆర్ఎస్ బలం 12 నుంచి 11కు తగ్గింది.

అయితే రాను రాను జిల్లాలో టీఆర్ఎస్ బలం ఇంకా తగ్గేలా ఉంది. నిదానంగా ఈటల....టీఆర్ఎస్‌లోని కీలకమైన నాయకులని, క్యాడర్‌ని బీజేపీలోకి లాగేలా ఉన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ రెబల్‌గా రవీందర్ సింగ్‌ని నిలబెట్టారు. ఆయన గానీ గెలిస్తే కారుకు మరిన్ని కష్టాలు వస్తాయి.

ఇక ఆయన గెలవకుండా ఉండటానికి, జిల్లాలో టీఆర్ఎస్ బలం తగ్గకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్ గట్టిగా కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు నేతలతో టచ్‌లో ఉంటున్నారు. మరి చూడాలి కేటీఆర్ కష్టం ఎంతవరకు ఫలిస్తుందో...అలాగే ఈటల రాజేందర్ వల్ల కారుకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: