ఇటీవలి కాలంలో మొబైల్ వినియోగం ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తున్నాయి. తమ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పంచుకుంటున్నాయి మొబైల్ కంపెనిలు. అయితే ప్రస్తుతం మొబైల్ మార్కెటింగ్ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాయి. ఒప్పో రెడ్ మీ ఫోన్లు. చైనా కు సంబంధించిన ఈ రెండు బ్రాండ్లు కూడా ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు అందరిని కూడా ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇతర మొబైల్స్ తో పోల్చిచూస్తే మంచి అధునాతనమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఇటీవల కాలంలో అటు ఒప్పో రెడ్ మీ కంపెనీలకు చెందిన మొబైల్స్ వాడటానికి యూత్ ఇష్టపడుతున్నారు. ఇలా ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ తో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న ఒప్పో రెడ్ మీ కంపెనీలకు ఇటీవలే మోడీ గవర్నమెంట్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది అని తెలుస్తోంది. చైనాకు సంబంధించిన ఈ రెండు మొబైల్ కంపెనీలు ఎన్నో రోజుల నుంచి భారత్లో పాల్పడుతున్న అక్రమాలు ఇటీవల బయట పడ్డాయ్. ఈ క్రమంలోనే ఇటీవల ఈ విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకకుంది మోడీ ప్రభుత్వం. చైనా కు సంబంధించిన ఈ రెండు మొబైల్ కంపెనీ లకు కూడా షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.



 ఇలా ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ మార్కెట్లో  ఒప్పో రెడ్ మీ కంపెనీ లకు ఏకంగా వెయ్యి కోట్ల పెనాల్టి వేసేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే తప్పుడు లెక్కలు చూపించిన కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించబోతున్నట్లు తెలుస్తోంది. చైనా కు సంబంధించిన ఈ రెండు మొబైల్ కంపెనీలు కూడా భారత్ లో ఎక్కువగా అమ్మకాలు జరిగినప్పటికీ సగానికిపైగా అమ్మకాలను  సంబంధించిన వివరాలు దాచి కేవలం సగం అమ్మకాలకు సంబంధించిన వివరాలను  భారత ప్రభుత్వానికి సమర్పించినట్లు ఇటీవల నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు మొబైల్ కంపెనీలకు వెయ్యి కోట్ల జరిమానా విధించాలని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. మరి మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: