అసలు తంబళ్ళపల్లెలో టీడీపీ వీక్ అవ్వడానికి కారణమే శంకర్ అని సొంత పార్టీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. 2014లో గెలిచిన ఈయన నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఓడిపోయాక శంకర్ అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా బెంగళూరులోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.
ఇక్కడేమో తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి తమ్ముడు హవా నడుస్తోంది. టీడీపీలో ఉన్న బలమైన నాయకులని తనవైపుకు తిప్పేసుకున్నారు. అలాగే కొంత క్యాడర్ కూడా అటు వెళ్లిపోయింది. దీంతో తంబళ్ళపల్లెలో టీడీపీ వీక్ అయింది. ఇటీవల పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా సరే శంకర్ నియోజకవర్గం వైపు చూడలేదు. అయితే తాజాగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఇంచార్జ్‌ని మార్చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో శంకర్ అలెర్ట్ అయ్యారు. మళ్ళీ చంద్రబాబు దగ్గరకొచ్చి బ్రతిమలాడారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పని చేయలేకపోయానని, ఇక నుంచి పనిచేస్తానని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
దీంతో చంద్రబాబు, శంకర్‌కు మరో అవకాశం ఇచ్చారు. అయితే నియోజకవర్గంలో టీడీపీ నేతలు మాత్రం...ఓడిపోయే నేతకు బాధ్యతలు ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. ఈయన్ని మార్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం కొన్ని నెలలు శంకర్ పనితీరు పరిశీలిస్తానని, ఆ తర్వాత కూడా మెరుగు పడకపోతే మొహమాటం లేకుండా మార్చేస్తానని చెప్పారు. అయితే పెద్దిరెడ్డి తమ్ముడుకు చెక్ పెట్టాలంటే శంకర్ లాంటి నాయకుడు సరిపోయేలా లేరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి