నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోయింది. ఇది ఎవరో చెబుతున్నది కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటే చాలు అయ్యో పాపం అంటూ జాలి చూపించారు. వారికి ఏదో ఒక సహాయం చేసే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం జాలి దయ అనేది లేకుండా సాటి మనుషుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎంతో మంది జనాలు. కనీసం మానవత్వాన్ని కూడా చూపించడం లేదు చిన్న చిన్న విషయాలకే కఠినంగా వ్యవహరిస్తూ న్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒకవైపు విజయ్ మాల్యా లాంటివాళ్ళు బ్యాంకులకు కోట్ల కోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తుంటే  పట్టించుకోని అధికారులు ఇక చిన్న చిన్న మొత్తంలో అప్పులు తీసుకుని ఇక ఆర్థిక పరిస్థితి బాగాలేక అవి కట్టలేని రైతులు సామాన్య ప్రజల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లో అప్పు చెల్లించలేదు అంటూ డిసిసిబి ఉద్యోగులు రుణ గ్రహీతల ఇళ్లకు తాళాలు వేయడం సంచలనంగా మారిపోయింది. ఇక ఇలా అధికారులు స్నేహితుల ఇళ్లకు తాళాలు వేయడంతో ఎంతో మంది ఇక రాత్రి మొత్తం చలిలోనే అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


 ఇక ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు చుట్టుపక్కల ఇళ్ళల్లో అడిగి కడుపు నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా కలకలం సృష్టించింది.. అదే సమయంలో ఇటీవలి కాలంలో పదివేల రుణాలు తీసుకున్నవారీ నుంచి ఏకంగా వడ్డీతో సహా 20000 రూపాయలను డిసిసిబి అధికారులు వసూలు చేస్తూ ఉండటం సంచలనంగా మారిపోయింది.  ఇక ఇలా అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తుండటంతో ఇక లబ్ధిదారులు అప్పు చెల్లించకపోతే.. ఇళ్లకు తాళం వేస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు డిసిసిబి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: