ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు మంచి రోజులొచ్చాయి. ఎంతో కాలంగా చదువుకుని పట్టా చేతిలో ఉండి కూడా సరైన ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న యువతీ యువకులకు నోరు తీపి చేసే వార్తను అందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకీ రిలీజ్ చేసిన పోస్ట్ లు ఏమిటో? దానికి కావలసిన అర్హతలు? మరియు ఎంపిక విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ పి పి ఎస్ సి తాజాగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో ఏపీ రెవిన్యూ మరియు ఏపీ ఎండార్స్మెంట్ శాఖలలో కొలువులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఉద్యోగాల విభాగం విషయానికి వస్తే,

పోస్ట్ వివరాలు:  సీనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్

ఉద్యోగాలు మొత్తం: 670

వయసు పరిమితి : ఈ జాబ్ కోసం కేవలం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు లోపు వారు మాత్రమే అప్లై చేసుకోగలరు.

విద్యా అర్హత: ఈ జాబ్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి.  అంతే కాకుండా ఈ ఎంపికకు సంబంధించి జిల్లా కలెక్టర్ కండక్ట్ చేసే ఒక కంప్యూటర్ ఎఫిసియెన్సీ టెస్ట్ లో ఉతీర్ణులు అవ్వాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్: ఎప్పటి లాగే స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ ఎక్జామినేషన్ మరియు కంప్యూటర్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.


పోస్ట్ వివరాలు:  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్)  

ఉద్యోగాలు మొత్తం: 60

వయసు పరిమితి : ఈ జాబ్ కోసం కేవలం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు లోపు వారు మాత్రమే అప్లై చేసుకోగలరు.

విద్యా అర్హత: ఈ జాబ్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి.  అంతే కాకుండా ఈ ఎంపికకు సంబంధించి జిల్లా కలెక్టర్ కండక్ట్ చేసే ఒక కంప్యూటర్ ఎఫిసియెన్సీ టెస్ట్ లో ఉతీర్ణులు అవ్వాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్: ఎప్పటి లాగే స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ ఎక్జామినేషన్ మరియు కంప్యూటర్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

పైన తెలుపబడిన పోస్ట్ లకు అప్లై చేసుకోవడానైకి చివరి తేదీ: 29.01.2022 ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: 28.01.2022

పూర్తి వివరాలకు: ఈ వెబ్సైటు ను సందర్శించండి.

 https://psc.ap.gov.in/




మరింత సమాచారం తెలుసుకోండి: