అయితే అధికారం ఉంది కదా అని చెప్పి..తనకు తిరుగులేదని ధీమాతో ఉంటే మాత్రం సక్సెస్ కూడా వెనక్కి వెళుతుంది. టెక్కలి ఇంచార్జ్‌గా ఉన్న దువ్వాడ..వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. రాజకీయంగా తనకు ఎదురు ఎవరు ఉండకూడదనే కోణంలో సొంత పార్టీ నాయకులనే తోక్కేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అధికారం ఉండటంతో పెత్తనం చేయడం ఎక్కువైపోయిందనే టాక్ వస్తుంది. పైగా ఎమ్మెల్సీ కూడా దక్కడంతో ఆయన ఎక్కడా తగ్గడం లేదు. అంతా తన ఇష్టమే అన్నట్లు ముందుకెళుతున్నారు.
దీంతో ప్రత్యర్ధి పార్టీల సంగతి పక్కన పెడితే...ముందు సొంత పార్టీ వాళ్లే దువ్వాడ అంటే ఫైర్ అయిపోతున్నారు. దువ్వాడ ఒంటెద్దు పోకడలు వల్ల పార్టీ నాశనమవుతుందని చెప్పి సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. అసలు అచ్చెన్నాయుడు లాంటి దిగ్గజ నాయకులకు చెక్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. ప్రజల మద్ధతు పెంచుకోవాలి. అప్పుడే రాజకీయంగా అచ్చెన్నాయుడుని ఎదురుకోవచ్చు.
అలా కాకుండా అధికార బలంతో హడావిడి చేస్తే ప్రజల మద్ధతు దొరకదు. పైగా ప్రజలు దూరమవుతారు కూడా. ఇప్పుడు టెక్కలిలో అదే జరుగుతుంది. ఏదో అధికారంలో ఉండటం వల్ల ప్రజలు సైలెంట్‌గా ఉంటున్నారు గాని, కరెక్ట్ టైమ్ దొరికితే..దువ్వాడకు చెక్ పెట్టేలా ఉన్నారు. అటు సొంత పార్టీ నేతలు సైతం దువ్వాడపై అసంతృప్తిగా ఉన్నారు. వారు కూడా యాంటీగా పనిచేస్తే..మళ్ళీ దువ్వాడ దశ మారడం కష్టం. ఇప్పటికే మూడు సార్లు ఓడిపోయారు...ఇదే పరిస్తితి కొనసాగితే నాల్గవ సారి కూడా ఓడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి