ఇంటర్నెట్ అనే దాంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ ను కాదని పని చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. గూగుల్ ఎంత గొప్పది అన్నది ఈ ఒక్క మాటతో చాలా ఈజీగా చెప్పేయొచ్చు. ఈ జనజీవనంలో అంతటి ప్రభావాన్ని చూపే గూగుల్ తాజాగా తనకు సంబంధించి ఒక అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..గూగుల్ జీ సూట్ వినియోగదారుల కోసం రూపొందించిన కరెంట్స్ ను నిలిపివేస్తున్నట్లుగా తేల్చింది. 2019లో ఫస్ట్ టైం ఈ సేవల్ని ప్రారంభించిన గూగుల్ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఆ సేవల్ని బంద్ చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.గూగుల్ అందించే సర్వీసెస్ లో అతి తక్కువ ప్రజాదరణ పొందిన ఈ కరెంట్స్ కు సంబంధించిన సేవల్ని తామిక అందించలేమని స్పష్టం చేసింది. 2023 వ సంవత్సరం నాటికి పూర్తిగా మూసివేస్తామని తాజాగా గూగుల్ తేల్చి చెప్పింది. అయితే.. ఇక గూగుల్ కరెంట్స్ సేవను వినియోగిస్తున్న వారి సంగతేమిటి? అన్న ప్రశ్నకు గూగుల్ సమాధానం ఇస్తోంది.కరెంట్స్ లో ఉండే అన్ని ఫీచర్లను గూగుల్ స్పేసెస్ కు యాడ్ చేస్తామని పేర్కొంది. 

గూగుల్ స్పెసెస్ ద్వారా యూజర్లు చాటింగ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తారు. దీంతో..ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవటం అనేది చాలా సులువుగా ఉంటుందని చెబుతున్నారు.గూగుల్ స్పెసెస్ వాడే వారు.. గూగుల్ మొయిల్ ఇన్ బాక్స్ ద్వారా గూగుల్ ఛాట్ చేసుకోవటంతో పాటు.. గూగుల్ డాకస్ లో చెక్ లిస్టే ఏర్పాటు చేసుకోవటానికి ఇందులోని స్మార్ట్ కాన్వాస్ సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక పెద్ద కమ్యూనిటీలు పెద్ద ఎత్తున వినియోగించుకోవటానికి గూగుల్ స్పెసెస్ వీలు అనేది కల్పిస్తుంది.ఇందులోని స్మార్ట్ కాన్వాస్ ఫీచర్ సపోర్ట్ తో యూజర్లు తమకు సంబంధించిన డాక్యుమెంట్లను గూగుల్ మీట్ ద్వారా ఇతరులకు షేర్ చేసుకునే వీలు కూడా వుంది. ఇక గతంలో పెయిడ్ సర్వీసుగా ఉండేదాన్ని ఇప్పుడు ప్రతి యూజర్ కు ఫ్రీ గా అందజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: