రెడ్డి వర్గం అంటే అందరికీ వైసీపీనే గుర్తొస్తుందని చెప్పొచ్చు...ఎందుకంటే ఆ పార్టీలోనే రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉంటుంది కాబట్టి...అసలు వైసీపీ అంటే రెడ్డి వర్గం...రెడ్డి వర్గం అంటే వైసీపీ అన్నట్లు పరిస్తితి ఉంటుంది. అయితే వైసీపీలోనే రెడ్డి నేతలు ఉంటారా? టీడీపీలో లేరా? అంటే టీడీపీలో కూడా రెడ్డి నేతలు ఉన్నారు గాని...వైసీపీలో ఉన్నంత బలంగా మాత్రం లేరని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన రెడ్డి నేతలు అందరు గెలిచారు...కానీ టీడీపీలో పోటీ చేసిన రెడ్డి నేతలు ఒక్కరు కూడా గెలవలేదు.

అయితే ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో టీడీపీ రెడ్డి నేతలు పనిచేస్తున్నారు...ఇప్పటికే పలు నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుంటున్న రెడ్డి నేతలు చాలా వరకు పుంజుకున్నారు..ఇదే క్రమంలో పుట్టపర్తిలో సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి సైతం పికప్ అయ్యారని తెలుస్తోంది. మామూలుగా పుట్టపర్తి టీడీపీకి కంచుకోట...ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో పుట్టపర్తిలో పల్లె సత్తా చాటారు.

కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది...అప్పటికే టీడీపీపై వ్యతిరేకత రావడం, జగన్‌పై ప్రజల్లో సానుభూతి ఉండటంతో...పుట్టపర్తిలో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి' target='_blank' title='శ్రీధర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీధర్ రెడ్డి దాదాపు 31 వేల ఓట్ల మెజారిటీతో పల్లెపై గెలిచారు. అయితే శ్రీధర్ కూడా తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతని తెచ్చుకున్నారని పలు సర్వేల్లో తెలుస్తోంది.

ఈయన ప్రజలకు సేవ చేయడం కంటే సొంత పనులు చేయడంలోనే ముందున్నారని, అలాగే పుట్టపర్తిలో అనేక అక్రమాలు కూడా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి...ఇక టీడీపీ నేత పల్లె సైతం దూకుడుగా రాజకీయం చేయడంతో పుట్టపర్తిలో సీన్ రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది..పైగా ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది...దీంతో పుట్టపర్తిలో పల్లె పికప్ అయ్యారు..నెక్స్ట్ ఎన్నికల్లో పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి పల్లె రఘునాథ్ రెడ్డి చెక్ పెట్టేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: