ఇపుడిదే విషయం రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పే చర్చకు దారితీసింది. రాజధాని అమరావతిపై విచారణ జరిపిన కోర్టు విచిత్రమైన, లాజిక్కుకు అందని తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పులో చాలా అంశాలున్నాయి కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మూడే. అవేమిటంటే అమరావతి ప్రాంతంలో నెలరోజుల్లో మౌళికసదుపాయాలు ఏర్పాటు చేసేయాలట. అంటే రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, మంచినీటి సౌకర్యన్నమాట.
ఇక రెండోదేమిటంటే మూడునెలల్లో ప్లాట్లను అభివృద్ధిచేసి రైతులకు ఇచ్చేయాలట. చివరి పాయింట్ ఏమిటంటే ఆరుమాసాల్లో మాస్టర్ ప్లానులో చెప్పినట్లుగా అమరావతి నగరాన్ని నిర్మించేయాలట. నిజానికి ఈ మూడు వాస్తవంలో జరిగేపనికాదని అందరికీ తెలుసు. జగన్ కాదు కదా ఇపుడు చంద్రబాబునాయుడే సీఎంగా ఉన్నా చేయలేరు. తమ తీర్పును అమలు చేయటం అసాధ్యమని కోర్టుకు తెలీకుండానే ఉంటుందా ? తెలిసినా తీర్పిచ్చేసిందంతే.
ఐదేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబే అమరావతి ప్రాంతంలో మౌళిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు ? రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు ? తానే తయారుచేసిన మాస్టర్ ప్లాను ప్రకారం నవనగరాలను చంద్రబాబు ఎందుకు నిర్మించలేకపోయారు ? ఎందుకంటే ఇవన్నీ జరిగేపనికాదని చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. నిజానికి ప్రపంచచరిత్రను తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా రాజధాని నగరాన్ని నిర్మించిన ఉదాహరణలేదు.
ప్రభుత్వాలు తమకు అవసరమైన భవనాలను మాత్రమే నిర్మించుకుంటాయి. ప్రజలకు అవసరమైన మౌళికసదుపాయాలను మాత్రమే ఏర్పాటుచేస్తాయి. మిగిలిన నగరమంతా దానిపాటికి అదే అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమేథావుల్లో ఒకడైన చంద్రబాబుకు ఈ విషయం తెలీదా ? బాగా తెలిసే కావాలనే నవనగరాల నిర్మాణం అనేదాన్ని ఎత్తుకున్నారు. మొదటి దశలోనే లక్ష కోట్లరూపాయలు కావాలంటే ఎక్కడి నుండి తేవాలన్నదే అసలు సమస్య.
ఎందుకంటే రాజధాని నిర్మాణపనులను అలా మొదలుపెట్టి 2019 ఎన్నికల్లో దాన్ని చూపించి మళ్ళీ అధికారంలోకి రావాలనేది అసలు రహస్యం. చంద్రబాబు అయితేనే అమరావతి నిర్మాణం కట్టగలరు మరొకరికి సాధ్యంకాదు అని జనాల బుర్రల్లోకి ఎక్కించాలన్నది అసలు ప్లాన్. దీనికోసమే గ్రాఫిక్స్ తో భ్రమరావతిని సృష్టించి ఎల్లోమీడియాలో విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. చివరకు జనాలు మరోరకంగా ఆలోచించటంతో అమరావతి కాస్త నిజంగానే భ్రమరావతిగా మిగిలిపోయింది. కోర్టు తీర్పుతో ఆ భ్రమరావతి అమరావతిగా మారుతుందా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి