మామూలుగా ప్రతి రోజు ఉదయం దేశ వ్యాప్తంగా ఉన్న ఆయిల్ కంపెనీలు ప్రధాన నగరాలలో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బట్టి స్థానికంగా మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిర్ణయిస్తారు. అదే విధంగా ఈ రోజు ప్రకటించిన ధరలను బట్టి చూస్తే ఎటువంటి మార్పు లేదు అని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు వ్యాట్ దర తగ్గించి అమ్ముతుండడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది. పెద్ద నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో హెచ్చు తగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది.
దానిని బట్టి చూస్తే హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20 , డీజిల్ ధర రూ. 94.62 గా ఉన్నాయి. కరీంనగర్ లో పెట్రోల్ రూ. 108.38 మరియు డీజిల్ రూ. 94.69 గా ఉన్నాయి. వరంగల్ లో పెట్రోల్ రూ. 107.69 మరియు డీజిల్ రూ. 94.14 గా ఉంది. ఇక ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడ లో పెట్రోల్ రూ. 110.91 మరియు డీజిల్ ధర రూ. 95.51 , విశాఖపట్నం లో పెట్రోల్ ధర రూ. 109.40 మరియు డీజిల్ ధర రూ. 95.51 ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ లో పెట్రోల్ రూ. 95.41 మరియు డీజిల్ రూ. 86.67 గా ఉన్నాయి. ముంబై లో పెట్రోల్ రూ. 109.98 మరియు డీజిల్ రూ. 94.14 గా ఉంది. ఇలా ఈ రోజు చమురు ధరలు దేశ వ్యాప్తంగా ఉన్న తగ్గాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి