ఈ విశ్వంలో వింతలు జరగడం కొత్తేమీ కాదు. ఊహకు కూడా అందని ఎన్నో అద్భుతాలు ఈ ప్రపంచంలో జరిగి ఉన్నాయి. కాలానుగుణంగా మరికొన్ని పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా అలాంటి అద్భుతమే ఒకటి అంతరిక్షం లో తారసపడింది. పాలపుంతలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అన్న విషయం పై ఇప్పటికీ అన్వేషణ జరుగుతూనే ఉంది. అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ నాసా అంతరిక్షంలో ఏమి జరుగుతోంది అనే విషయంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా నాసా శాస్త్రవేత్తలకు ఒక షాకింగ్ విషయం ఎదురయ్యింది.  అంతరిక్షంలో వారికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది.

అంతరిక్షంలో మరో కొత్త గ్రహం తయారు అవుతున్నట్లు నమూనాలు కనిపించాయి. నాసా తన హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు తెలిపింది.  ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది బృహస్పతి  (జూపిటర్) గ్రహం కన్నా పెద్దదిగా ఉండొచ్చని అంతే కాకుండా దాదాపు 9 రెట్లు పెద్దదిగా ఉంటుంది అని ఒక అంచనా. ఈ గ్రహానికి ఏబీ ఔరిగేయి బీ (AB Aurigae b) అని నామకరణం చేశారు నాసా శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ గ్రహం అసాధారణ పద్ధతిలో నిర్మాణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహ నిర్మాణం కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న ఒక సిద్ధాంతానికి మద్దతుగా ఏర్పడుతోందని వారు చెబుతున్నారు.

'డిస్ట్ అస్థిరత' అనే సిద్దాంతాం జూపిటర్ వంటి గ్రహాల ఏర్పాటుకు సంబంధించినదని, కాగా వాటికి ఈ గ్రహ ఏర్పాటు సపోర్ట్ చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ కొత్త గ్రహం గురించి ప్రస్తుతం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో వస్తున్న వివిధ రకాల మార్పుల కారణంగా ఖగోళ శాస్త్రంలో పలు అద్భుతాలు జరుగుతున్నాయి. మరి ఈ కొత్త గ్రాహం కారణంగా నాసా శాస్త్రవేత్తలు ఎటువంటి కొత్త విషయాలను కనుగొననున్నారు అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: