కొన్నిసార్లు పరిస్ధితులు విచిత్రంగా మారిపోతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఇపుడీద్దరి నేతల పరిస్ధితి ఒకేలాగ ఉండటం యాధృచ్చికమనే అనుకోవాలి. విచిత్రం అని ఎందుకంటున్నామంటే ఇద్దరు కూడా ముఖ్యమంత్రి స్ధానంపైనే కన్నేశారు. ఇద్దరూ ఒంటరిగా పోటీచేసి కనీసం ఎంఎల్ఏలుగా కూడా గెలవలేనంత బలహీనులు. ఎంఎల్ఏలుగా కూడా గెలవలేని నేతలు ఏకంగా సీఎం అయిపోదామని కలలు కంటున్నారంటే విచిత్రం కాకమరేమిటి ?

ఆ ఇద్దరు నేతలు ఎవరో ఈపాటికే అర్ధమైపోయుండాలి. అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషే. ఇద్దరిలో కొన్ని పోలికలున్నాయి. ఇద్దరికీ విషయపరిజ్ఞానం తక్కువే. నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తమలోని తప్పులను సరిచేసుకోకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేయటమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు.

మంగళగిరిలో పోటీచేసి లోకేష్ ఓడిపోతే గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో రెండుచోట్ల పోటీచేసి పవన్ ఓడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు ఇద్దరు కూడా తమకు సేఫ్ నియోజకవర్గాన్ని ఇంతవరకు ఎంపిక చేసుకోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడే లోకేష్ ఏదో ఒక నియోజకవర్గంలో పోటీచేసి గెలిచుంటే అదే తన నియోజకవర్గమయ్యేది. అయితే పార్టీ అధికారంలో ఉన్నపుడే గెలుపుపై నమ్మకంలే దొడ్డిదారిన ఎంఎల్సీగా మంత్రివర్గంలోకి దూరారు. దాంతో లోకేష్ కు అసలు నియోజకవర్గమే లేకుండాపోయింది.

ఇక పవన్ గెలిచే నియోజకవర్గంపై అనేక సర్వేలు చేసి చేసి వడపోసి చివరకు రెండు నియోజకవర్గాలను ఎంపికచేసుకుని రెండుచోట్లా ఓడిపోయారు. అంటే పవన్ నిర్ణయం ఎంత తప్పుడుదో అర్ధమైపోయింది. లోకేష్ అన్నా ఏదో మాటవరసకు మళ్ళీ మంగళగిరిలోనే పోటీచేస్తానని ప్రకటించారు కానీ పవన్ అయితే ఆ పనికూడా చేయలేదు. అంటే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. ఎలాగంటే ముందు తాను కుప్పంలో గెలవాలి. ఇదే సమయంలో లోకేష్ కు గెలుపు నియోజకవర్గం చూడాలి. పొత్తు కుదిరితే పవన్ గెలుపుకు కూడా చంద్రబాబే కష్టపడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: