క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్యనే నారాయణ విద్యాసంస్ధల అధినేత నారాయణ అరెస్టు విషయం ఇపుడు మరుగునపడిపోయింది. ఎందుకంటే చిత్తూరు నుండి హైదరాబాద్ కు నాలుగు వాహనాలను వేసుకుని వచ్చి, అరెస్టుచేసి మళ్ళీ చిత్తూరు కోర్టుకు తీసుకుపోయారు పోలీసులు. అంటే దాదాపు 18 గంటలకు పైగా పోలీసులు బాగా రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి 






చిత్తూరు నుండి హైదరాబాద్ కు వచ్చి తిరిగి చిత్తూరుకు చేరుకోవటానికి పట్టినంతకాలం కూడా  నారాయణను పోలీసులు అదుపులో ఉంచుకోలేకపోయారు. పోలీసులు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టడం నారాయణకు కోర్టు బెయిల్ ఇచ్చేయటం వెంటవెంటనే జరిగిపోయింది. నిజంగా ఇది పోలీసులకు, ప్రభుత్వానికి అవమానమే. ఇక్కడ రెండు విషయాలు చాలా విచిత్రంగా జరిగిపోయాయి. అవేమిటంటే మొదటిదేమో నారాయణకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు అడగకపోయినా కోర్టు బెయిల్ మంజూరు చేసేయటం.






ఇక రెండో విచిత్రం ఏమిటంటే నారాయణకు బెయిల్ ఇవ్వకూడదని ప్రభుత్వం తరపున వాదించాల్సిన లాయర్ అసలు విచారణకే హాజరుకాకపోవటం. నారాయణను కోర్టుకు తీసుకొస్తున్న విషయాన్ని, నారాయణ బెయిల్ అప్లికేషన్ కు వ్యతిరేకంగా వాదించేందుకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ సదరు లాయర్ కు రెండుమూడుసార్లు చెప్పినా ఆ లాయర్ కోర్టుకు హాజరుకాలేదు. అంటే తెరవెనుక ఏదో జరిగిందని అర్ధమైపోతోంది.






కోర్టు విచారణ తర్వాత నారాయణ ఫ్రీగా బయటకు వచ్చేశారు బాగానే ఉంది మరిపుడేం జరగబోతోంది ? అంటే ఏమీ జరిగేదిలేదని అర్ధమైపోతోంది. ఎవరిమీద కూడా నేరారోపణ నిలుస్తుందనే నమ్మకాలు ఎవరికీ లేవు. ఎందుకంటే నారాయణ బయటకు వచ్చేశారు. నారాయణ కుటుంబసభ్యులకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. నారాయణ సంస్ధల్లో కీలకస్ధానాల్లో పనిచేస్తున్న పదిమంది కూడా బెయిల్ తెచ్చేసుకున్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్ధదే కీలకపాత్రగా పోలీసులు నిరూపించాలంటే తాతలు దిగిరావాల్సిందే. మహాఅయితే ప్రశ్నపత్రాల లీకేజీలో ఏ అటెండరో, గుమాస్తానో బలైపోతారంతే. ఇంతకుమించి ఏదో అద్భుతం జరిగిపోతుందని నారాయణ+కుటుంబసభ్యులకు శిక్షలు పడిపోతాయని ఎవరూ అనుకోవటం కూడా లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: