పవిత్రమైన పుణ్యక్షేత్రాలలొ మద్యం, దూమపానం, మాంసం నిషెధించిన సంగతి తెలిసిందే.. అలాంటి చెయ్యడం మహా పాపం అని అధికారులు అలాంటి వాటిని నరఫరా చేస్తున్న వాటి పై కఠిన చర్యలను తీసుకుంటూన్నారు. అయిన కూడా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. నిన్న విజయవాడ అమ్మవారి సన్నిదానం లో దూమపానం పూర్తిగా నిషెధించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తిరుమల లో మాత్రం కలకలం రేపుతున్నాయి.


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టు బడింది. తిరుమల కు తరలిస్తున్న 20 మద్యం బాటిళ్ల ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర బెంగళూరు కి చెందిన వెంకటేశ్ నుంచి మద్యం బాటిళ్ల ను సీజ్ చేశారు. వెంకటేశ్ తిరుమల లో సివిల్ వర్కర్ గా పని చేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు.. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కు అప్పగించారు.


అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 20 మద్యం బాటిళ్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు కి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి తిరుమల లో ఓ కాంట్రాక్టర్ వద్ద సివిల్ వర్కర్ గా పని చేస్తాడు. వెంకటేశ్ తిరుమలకు వెళ్తూ తనతో పాటు 20 మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండ గా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంటనే వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు.. అతడిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాగా, ఇలా మద్యం తరలిస్తుండ గా పట్టు బడటం గత వారం రోజుల్లో ఇది రెండోసారి.. కొంత మంది అధికారుల కళ్ళు కప్పి మద్యం తీసుకొని వెళ్తున్నారు. ఎంత కఠినంగా ఉన్న కూడా ఇలా జరగడం పై అధికారులు షాక్ అవుతున్నారు.. దీని పై జనాలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: