‘డేటా చోరీ ఘటనలో చంద్రబాబునాయుడే సూత్రధారి’ ..ఇది తాజాగా భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు. డేటాచోరీ ఘటనలో పాత్రదారులందరినీ హౌస్ కమిటి ముందు విచారణకు పిలుస్తామని భూమన చాలా ఆర్భాటంగా ప్రకటించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో డేటాచోరీ జరిగిందని అప్పట్లోనే వైసీపీ ఎంఎల్ఏలు ఆరోపించారు. వీళ్ళ ఆరోపణలకు మూలం ఏమిటంటే హైదరాబాద్ లో బయటపడిన డేటాచోరీ ఘటన. లక్షలాది మంది ఆధార్ కార్డులు, మొబైల్ నెంబర్లతో పెద్ద బృందం పట్టుబడింది. దీంతో డేటాచోరీ అనే విషయం వెలుగులోకి వచ్చింది.
తెలుగుదేశంపార్టీ హయాంలో జరిగిన విషయం కాబట్టి, అప్పుడు పట్టుబడిన వాళ్ళల్లో అత్యధికులు టీడీపీ వాళ్ళే కాబట్టి కచ్చితంగా అందులో చంద్రబాబే అసలు సూత్రదారనే అనుకుందాం. అయితే ఇపుడు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును ఏమిచేయగలదు ? చంద్రబాబును హౌస్ కమిటి ముందుకు విచారణకు కాదు కదా కనీసం ఇచ్చిన నోటీసుకు రిప్లై కూడా తెప్పించుకోలేరు. చంద్రబాబును ఎవరు ఏ రకంగా కూడా ఇబ్బందులు పెట్టలేరన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపణైంది.
ప్రపంచానికంతా తెలిసిన ఓటుకునోటు కేసులోనే చంద్రబాబుకు ఏమీకాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వివిధ వ్యవస్ధల్లో చంద్రబాబుకు ఉన్న పట్టు చెదిరిపోనంతవరకు ఆయన్ను ఎవరు ఏమీ చేయలేరన్న విషయం ఇంకా వైసీపీకి అర్ధంకాకపోవటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా తన సొంతబలాన్ని అవసరమైతే పక్కవాళ్ళ సాయాన్ని నమ్ముకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం కేవలం అదృష్టాన్ని, వ్యవస్ధలను మాత్రమే నమ్ముకున్నారు.
అందుకనే ముఖ్యమంత్రి పదవి పోయినా ఇంకా హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే తన కెపాసిటి ఏమిటో అర్ధం కావటంలేదా ? కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబును అదిచేస్తాం, ఇదిచేస్తం అనే ప్రకటనలు మానుకుంటే బెటర్. విచారణలు, నోటీసులు, కేసులన్నింటినీ పక్కన పెట్టేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలన్న విషయంమీద దృష్టిపెడితే బెటర్. లేదంటే తనను వేధిస్తున్నారని చెప్పుకుని జనాల్లో సింపథి తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారు. చంద్రబాబును కొట్టాలంటే ఎన్నికల్లో జనాల మద్దతుతో ఓట్లరూపంలోనే కొట్టాలంతే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి