ప్రస్తుతం ఏపీలో గత రెండు వారాల నుండి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ది అని చెబుతున్నా న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం... ఇక అప్పటి నుండి దాని చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో చాలా బిజీ గా ఉంది. మీడియా ముఖంగా గోరంట్ల మాధవ్ ను, సీఎం జగన్ ను మరియు వైసీపీ ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. వెంటనే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విమర్శలు ఎక్కువయ్యాయి.

అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎటువంటి స్పష్టత రాకపోవడం తో వైసీపీ అధిష్టానం చూస్తూ ఉంటోంది. దానికి తోడు అనంతపురం ఎస్పీ సైతం ఇది ఒరిజినల్ వీడియో కాదని... కాఫీ వీడియో అని దీనిని ఫోరెన్సిక్ కు పంపడం వీలు కాదని మీడియా ముఖంగా చెప్పడంతో... వైసీపీ కూడా ఆ విషయం తేలే వరకు ఎటువంటి చర్యలు తీసుకునేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే... ఇటువంటి పరిస్థితుల నడుమ వచ్చే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తుందా అన్న ప్రశ్న మెదులుతోంది. అయితే రాజకీయ ప్రముఖుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వివాదం వచ్చినా రాకపోయినా... రానున్న ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు ఎంపీ సీటు దక్కే అవకాశాలు లేవని అంటోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం గత ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి ని ఎదిరించడం, హిందూపురం లో కురబ కులం అధికంగా ఉండడం... వంటి కొన్ని కారణాల వలన మాధవ్ కు ఎంపీ సీటు దక్కింది... అదే విధంగా రాష్ట్రమంతా వీచిన వైసీపీ గాలిలో గోరంట్ల మాధవ్ కూడా ఎంపీ గా విజయం సాధించాడు. తాను ఎంపీ గా అయిన తర్వాత హిందూపురం లో పెద్దగా చేసింది ఏమీ లేదని రికార్డులు చెపుతున్నాయి. పైగా ఎంపీ అయిన కొత్తలో కియా మోటార్స్ ఎండీ ని హేళనగా మాట్లాడడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ముందుగానే వైసీపీ అధిష్టానం ఈ సారి హిందూపురం ఎంపీ సీటు తనకు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గతంగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది... గోరంట్ల మాధవ్ కు ఈ వీడియో శాపంగా మారుతుందా ? లేదా త్వరలోనే ఆ వీడియో తనది కాదు ఫేక్ అని నిరూపించి మళ్లీ రెండవ సారి ఎంపీ గా టికెట్ పొందగలడా లాంటి విషయాలు తెలియాలంటే ఇంకా కొంతకాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: