డబ్బులను రెట్టింపు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. అందులో బెస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్.. పోస్టాఫీసు లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాల ను పొందవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి, మీకు కేవలం 5000 రూపాయలు మాత్రమే అవసరం. ఇండియా పోస్ట్ అధికారి నుండి అందిన సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో 10 వేల కొత్త పోస్టాఫీసులు ప్రారంభం కానున్నాయి.


ప్రతి ఐదు కిలోమీటర్లకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే అటువంటి పరిస్థితి లో మీరు మీ ఇంటిలో లేదా మీ ఇంటికి సమీపం లో పోస్టాఫీసు ను తెరవడం ద్వారా కూడా సంపాదించవచ్చు. ప్రతి నెలా మంచి డబ్బు సంపాదించవచ్చు. ఇది అటువంటి వ్యాపార నమూనా, దీనిలో ప్రారంభం లో కేవలం రూ. 5000 మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పోస్టాఫీసు ఫ్రాంచైజీ లో రెండు రకాలు ఉన్నాయి. మీరు ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌ను తెరవవచ్చు లేదా మీరు ఏజెంట్‌గా మారడం ద్వారా సంపాదించవచ్చు. పోస్టాఫీసు కు సొంత నెట్‌వర్క్ లేనప్పటికీపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ అవసరం ఉన్న చోట ఫ్రాంఛైజీ మోడల్‌ను అక్కడ ప్రారంభించవచ్చు..


పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ కోసం మీరు దరఖాస్తు ఫారమ్‌ ను పూరించి సమర్పించాలి. దీనికి మీరు 15 రోజుల్లో మీకు పోస్టాఫీసు నుంచి సమాధానం వస్తుంది. ఇది కమీషన్ ఆధారంగా సంపాదిస్తుంది. జీతం పొందడానికి నిర్ణీత మొత్తం అంటూ ఏమిలేదు. ఫ్రాంచైజీని తీసుకోవడానికి మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మీకు కంప్యూటర్ గురించి తెలిసి వుంటే మరీ మంచిది..ఈ స్కీమ్ కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: