ఎటువంటి పథకాలను పొందానుకున్నా,ఏదైనా అప్లై చెయ్యాలాన్నా..ఆఖరికి రేషన్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ తప్పనిసరి.అయితే, కొందరు కేటుగాళ్లు ఇతరుల ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు.నకిలీ ఆధార్ కార్డుతో అసలైన వారిని మోసం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని అడ్డుకునేందుకే యూఐడీఏఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఆధార్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఆధార్ ప్రామాణీకరణ హిస్టరీని చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డును మీరే వినియోగిస్తున్నారా? లేక మరెవరైనా దుర్వినియోగం చేస్తున్నారా..లేదా ఇంకేదైనా జరిగిందా అనే వివరాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. 



ఆ హిస్టరీలో మీరు చేయని పనులు, లావాదేవీలు, డాక్యూమెంటేషన్ వర్క్స్ ఉన్నట్లయితే, వెంటనే uidai కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఏదైనా మార్పు, అప్‌డేట్ చేస్తే uidai డేటాబేస్‌లో అప్‌డేట్ రిక్వెస్ట్‌ నెంబర్‌గా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ ప్రామాణీకరణతను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
UIDAI వెబ్‌సైట్‌లో హోస్ట్ చేసిన ఆధార్ కార్డ్ వినియోగ వివరాలు, సేవలు, వ్యక్తిగత వివరాలు, మునుపటి వినియోగ వివరాల సహా పూర్తి సమాచారం అందిస్తుంది..



1.ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.


2. డ్రాప్-డౌన్ మెను నుండి 'ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ' ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
3. ఆ తరువాత ఆధార్ అథెంటికేషన్ హిస్టరీకి సంబంధించిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌తో పాటు సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయాలి.
5. 'OTP క్రియేట్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్(OTP) వస్తుంది.
7. ఇప్పుడు అథెంటికేషన్ టైప్, తేదీ లిమిట్, చూపాల్సిన కార్డుల సంఖ్య, OTP ని సెలక్ట్ చేసుకోవాలి.
8. ఆ తరువాత 'సబ్మిట్' ఆప్షన్‌ క్లిక్ చేయాలి.
9. ఆధార్ అథెంటికేషన్ వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటన్నింటినీ సరి చూసుకుని, ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే uidai కి కంప్లైంట్ ఇవ్వాలి.


ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకొవాల్సిన అంశాలు..


1. మీ మొబైల్ ఫోన్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసినట్లయితే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అందుబాటులో ఉంటుంది.


2. మొత్తం 50 కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.
3. ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ వినియోగదారులు తమ ఆధార్ సమాచారంలో మార్పులను ట్రాక్ చేయడానికి యాక్సెస్ ఇస్తుంది.
4. ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేయడానికి వర్చువల్ ID ని కూడా ఉపయోగించవచ్చు.
5. ఆధార్ కార్డ్ హోల్డర్‌కు మాత్రమే కార్డ్ హిస్టరీ యాక్సెస్ ఉంటుంది.
6. ఆన్‌లైన్‌లో మాత్రమే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అందుబాటులో ఉంటుంది.
7. పొయిన 6 నెలల కంటే పాత ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చూడలేరు.
8. కస్టమ్ డేటా పరిధిని ఉపయోగించి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేయొచ్చు.
9. ఆధార్ అథెంటికేషన్ గతంలో ఫెయిల్ అయిన అథెంటికేషన్ ప్రయత్నాల సంఖ్యను, ఆ ఫెయిల్యూర్‌కు కారణాలను కూడా చూపుతుంది..దాంతో మీరు ఆధార్ గురించి పూర్తీ వివరాలను తెలుసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: