సాధారణంగా తల్లిదండ్రుల సమక్షంలో ఒక ఇంట్లో ఎంతో అల్లారుముద్దు పెరిగిన ఆడపిల్ల ఆ తర్వాత అకస్మాత్తుగా ముక్కు ముఖం తెలియని అత్తారింట్లో అడుగుపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఏకంగా భర్త తండ్రి అంటే మామ వరుసయ్యే వ్యక్తి ఇక సొంత తండ్రిలా కోడలని చేరదీయాల్సి ఉంటుంది. పుట్టినింట్లో తల్లిదండ్రులు చూసుకున్నట్లుగానే ఇక మెట్టినింట్లో మామ కూతురికి ఏ కష్టం రాకుండా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇలా కోడలని కూతురిలా భావించి చేరదీసే మామలు ఎవరు కనిపించడం లేదు.


 చిన్న చిన్న కారణాలకే ఏకంగా కోడలు పై దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీసే మామలు కొంతమంది కనిపిస్తూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా కొడుకు భార్య అని తెలిసినప్పటికీ కూడా కోడలిపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి రోజుల్లో కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం ఇక కోడలు విషయంలో ఎంతో గొప్పగా ఆలోచించి సభ్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరుగుతుంది. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు మాకెందుకు అని కోడలిని ఇంటి నుంచి వెళ్లగొడుతున్న ఘటనలు వెలుగు చూస్తుంటే.


 ఇక్కడ మాత్రం కొడుకు ఆకస్మాత్తుగా చనిపోవడంతో ఏకంగా కోడలిని కూతురుగా భావించిన మామ ఏకంగా కోడలికి మరో వ్యక్తితో పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచాడు. ఒడిస్సా లోనే గండి నియోజకవర్గం లో ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే నవీన్ నందా కుమారుడు సంభిత్ పెళ్లైన కొద్ది రోజులకే ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్న కోడలికి నచ్చజెప్పిన నవీన్ చందా.. ఆమెకు మరో పెళ్లి చేశాడు. ఇక కోడలుగా మా ఇంట్లోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు కూతురుగా మా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: