దాదాపు తొమ్మిది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత కల్వకుంట్ల కవిత మొహం వాడిపోయి కనబడింది. సుదీర్ఘ విచారణ కారణంగా మొహం వాడిపోయిందా ? లేకపోతే విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పూర్తిగా  కవితను బట్టలు పించినట్లు పిండేశారా అన్న విషయమై క్లారిటిలేదు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసులోకి వెళ్ళిన కవిత రాత్రి 8.15 గంటలకు బయటకు వచ్చారు.

దాదాపు 9 గంటల పాటు జరిగిన విచారణకు మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత టీ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. ఉదయం విచారణ నిమ్మితం ఆఫీసులోకి వెళ్ళేటపుడు పిడికిలి బిగించి ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని నినాదం చేసిన కవిత తిరిగి బయటకు వచ్చినపుడు మాత్రం ఎవరితోను మాట్లాడలేదు. ఈడీ ఆఫీసు బయటే వెయిట్ చేస్తున్న పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, మీడియా వైపు కనీసం చూడనుకూడా చూడలేదు. ఎంతమంది మాట్లాడేందుకు ప్రయత్నించినా కవిత రెస్పాండ్ కాలేదు.

విచారణ నుండి బయటకు రావటం ఆలస్యం వెంటనే కారులో కూర్చునేశారు. కనీసం కారులోనుండి కూడా ఎవరికీ అభివాం చేయలేదు. వెళ్ళేటపుడేమో పిడికిలి బిగించిన కవిత తిరిగి బయటకు వచ్చినపుడు కనీసం అభివాదం కూడా చేయకపోవటంతో లోపల ఏమి జరిగుంటుందని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే.  ఈడీ ఆఫీసులో జరిగిన విచారణ మొత్తం కాన్ఫ్రంటేషన్ ఎంక్వయిరీ పద్దతిలోనే జరిగింది. కవిత వాడుతున్న రెండు సెల్ ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకున్నది.

విచారణ నుండి బయటకు వచ్చిన కవిత రాత్రికి తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. మళ్ళీ రెండో రౌండ్ విచారణ 16వ తేదీ జరుగుతుంది. మళ్ళీ ఆరోజుకు కవిత ఢిల్లీకి చేరుకుంటారు. జరిగిన విచారణంతా ప్రివిన్షెన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కిందే జరిగింది. అంటే జరిగిన విచారణంతా  తీవ్రమైన అభియోగాల మీదే జరిగినట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే ఈ అభియోగాల నుండి బయటపడటం కష్టమనే చెప్పాలి. లిక్కర్ స్కామ్ లో ఏమాత్రం పాత్రున్నా పీఎంఎల్ఏ చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేయటం తప్పదు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: