కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారహోరే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఓటురు మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అసాధ్యమైన హామీలను కూడా ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎన్నికల నేపథ్యంలో అటు డబ్బు మద్యం కూడా ఏరులై పారుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.



 అయితే అటు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా అటు ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి తలనొప్పులు ఉండడం ప్రతి ఎన్నికల్లో కూడా సహజమే. ఇక ఇలా ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులు ఎప్పుడు ఓట్లను చీల్చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా బాగా డబ్బున్న వ్యక్తులే ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు అనే భావన అందరిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక యాచకుడు మాత్రం కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు.



 ఎంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇటీవలే నామ పత్రం సమర్పించాడు. ఇందుకు భిక్షాటన  చేసి పోగు చేసిన పదివేల రూపాయలను డిపాజిట్ గా చెల్లించాడు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్ కు కావలసిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గం లో తిరుగుతూ యాచించాడు ఎంకప్ప. సేకరించిన నాణాలను ఇటీవల ఎన్నికల అధికారికి ఇచ్చాడు. కాగా అతను ఇచ్చిన నాణాలను రెండు గంటలు శ్రమించి చిల్లరంతా లెక్కించి నామినేషన్ స్వీకరించినట్లు ఎన్నికల అధికారి చెప్పుకొచ్చాడు. నేను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానొ ప్రజలకు చెప్పా.. వారి నుంచి డిపాజిట్ డబ్బు కూడా స్వీకరించా అంటూ ఎంకప్ప చెబుతున్నాడు. ఏది ఏమైనా ఇలా కర్ణాటక ఎన్నికలలో అటు ఒక యాచకుడు పోటీ చేస్తూ ఉండడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: