
కానీ ఇప్పుడు ప్రత్యేకించి కాంట్రాక్టు లెక్చరర్లు సరిగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. పది నెలల జీతంతో 12 నెలలు పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఇది చాలా దారుణం. మన ప్రభుత్వంలో ఐఏఎస్ లు గాని, ఐపీఎస్ లు గాని, చట్టాలు చేసేటువంటి వ్యక్తులు గాని 10 నెలల జీతంతో 12 నెలలు ఎవరైనా చేస్తారా. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కి ఇలా జీతాలు వేస్తే వాళ్ళు పని చేస్తారా, లేదంటే పార్లమెంట్ సిబ్బందికి ఇలా ఇస్తే అసలు ఉద్యోగాలు చేస్తారా.
వాళ్లే కాదు అసలు ఎవరూ కూడా ఒక్క నెల జీతం ఇవ్వకపోయినా చేయరు. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు అవసరం. అది ఉన్నవారైనా, లేనివారైనా సరే దాని కోసమే ఎవరైనా కష్టపడేది. మరి మిగిలిన వాళ్ళు ఎవరికీ కలిగించని ఈ ఇబ్బంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు మాత్రమే ఎందుకు కలిగిస్తున్నారు. గత సంవత్సరం ఈ సమస్యకి సొల్యూషన్ చూపించారు.
అప్పుడు 12 నెలలకి 12 నెలలు జీతం ఇచ్చారు జగన్ జోక్యంతో. అయితే మళ్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి అదే పాత విధానం మొదలైంది. కాంట్రాక్టు లెక్చరర్ కి 12 నెలల పనికి 10 నెలల జీతం మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపు మూడున్నర, నాలుగు వేలమంది కాంట్రాక్టు లెక్చరర్లు కాంట్రాక్టర్ రెన్యువల్ కావాలంటే ఇలా చేయాలని అంటున్నారట వాళ్ళు.