
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే నాటికి సొంత ఇంటి స్ధలం ఉండేలా చూడాలని నిర్ణయించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని కేబినెట్ నిర్ణయించింది.అలాగే రాష్ట్రం లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు యీనివర్శిటీల చట్టం లో సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే కురుపాం ఇంజనీరింగ్ కాలేజీ లో 50 శాతం గిరిజనులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకూ ఆమోదం తెలిపారు. దీంతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లునూ కేబినెట్ ఆమోదించింది.