పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా తయారైంది కేసీయార్ వ్యవహారం. విషయం ఏమిటంటే ఏవో ప్రయోజనాలను ఆశించి కేసీయార్ దాదాపు నెలన్నర రోజుల ముందే అభ్యర్ధుల మొదటజాబితాను ప్రకటించారు. ఇంతముందుగా జాబితాను  ఎందుకు ప్రకటించారంటే పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించుకునేందుకు, ప్రచారం చేసుకునేందుకు అభ్యర్ధులకు తగినంత సమయం దొరుకుతుందని. నిజంగా కేసీయార్ ఆలోచన మంచిదే.





కానీ ఆచరణలోకి వచ్చేసరికి రివర్సు కొడుతోంది. దీనికి కారణాలు రెండున్నాయి. మొదటిదేమో అభ్యర్ధులపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుండటం. రెండో కారణం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పాసవుతుందని అంటున్నారు. పాసయ్యే బిల్లు వెంటనే అమల్లోకి వస్తుందా లేకపోతే 2029 ఎన్నికల నుండి అమల్లోకి వస్తుందా అన్నది తెలీదు. వెంటనే అమల్లోకి వచ్చేట్లయినా లేకపోతే 2029 ఎన్నికల నుండి అమల్లోకి వస్తుందని తీర్మానం చేసినా కేసీయార్ కైతే సమస్యే.





ఎలాగంటే తక్షణమే అమల్లోకి వచ్చేట్లయితే ప్రకటించిన మొదటిజాబితాను రద్దు చేయాల్సింది. ఎందుకంటే రిజర్వేషన్ చట్టం ప్రకారం 119 సీట్లలో ఏ పార్టీ అయినా సరే మహిళలకు కచ్చితంగా 39 సీట్లను కేటాయించాల్సిందే. ఇపుడు కేసీయార్ ఇచ్చింది కేవలం ఏడంటే ఏడు సీట్లను మాత్రమే. అంటే బిల్లు లెక్కప్రకారమే ఇంకా 32 సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే. కాబట్టి మొత్తం జాబితాను రద్దు చేసి ఫ్రెష్ గా మళ్ళీ అభ్యర్ధులను ప్రకటించాల్సిందే.





దీంతో ఏమవుతుందంటే 32 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలు లేదా అభ్యర్ధులకు పోటీచేసే అవకాశం పోతుంది. దాంతో అవకాశాలు కోల్పోయిన వాళ్ళకు మండుతుంది. వాళ్ళేమి చేస్తారన్నది వేరే సంగతి. ఒకవేళ 2029 ఎన్నికల నుండి చట్టం అమల్లోకి వస్తుందని అనుకున్నా ఇప్పటినుండే టికెట్లు ఇవ్వాలని మహిళా నేతలు పట్టుబట్టే అవకాశముంది. కేసీయార్ అందుకు అంగీకరించకపోతే ఆడోళ్ళు తిరగబడే అవకాశముంది. రేపటి ఎన్నికల్లో వీళ్ళు సైలెంటుగా  ఏమిచేస్తారో తెలీదు. మొదటిజాబితాను మార్చినా లేదా మహిళలకు టికెట్లు ఇవ్వాల్సొచ్చినా కేసీయార్ కు సమస్యలు తప్పదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: