తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఎవరి ఊహకందని రీతిలో ప్రజలు తమ తీర్పును చెప్పారు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ చివరికి మొదటిసారి ఓటమి చవిచూసి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణలో కనుమరుగయిపోయింది అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా అధికారాన్ని చేపట్టింది.


నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగగా.. ఇక ఇటీవల డిసెంబర్ మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠ ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలకొంది. ఈ క్రమంలోనే  ఒకరకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది అని చెప్పాలి. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో కొంతమంది నాయకులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాలలో ఇక వార్ వన్ సైడ్ గానే మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో అత్యల్ప మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థులు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 ఆ వివరాలు చూసుకుంటే.. బిఆర్ఎస్ అభ్యర్థి యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి భరత్ పై 268 ఓట్ల తేడాతో గెలుపొందారు.

 యూకుత్ పుర నియోజకవర్గంలో ఎంబిటి పార్టీ అభ్యర్థి పై ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ మిరాజ్ 878 ఓట్లతో విజయం సాధించారు.

జుక్కల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే పై కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ కాంతారావు 1152 ఓట్లతో గెలుపొందారు.

 దేవరకద్రలో బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి జీ. మధు 1309 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


 నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై 2037 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్ విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: