వైసిపి పార్టీకి రాయలసీమలో చాలా గట్టి పట్టు ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఆవిర్భావం నుంచే అండగా రాయలసీమ ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికలలో సైతం రాయలసీమలో వైసీపీ పార్టీకి చాలా మెరుగైన ఫలితాలు కూడా వచ్చాయి. అయితే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆశించిన స్థాయిలలో ఫలితాలు రాలేకపోయాయి... కానీ 2019లో మాత్రం దాదాపు అన్ని ప్రాంతాలలో వైసీపీ పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. రాయలసీమలో అయితే 52 నియోజకవర్గాలకు 49 స్థానాలను గెలిచి ఒక రికార్డును సృష్టించాయి.


అయితే ఈసారి రాయలసీమలో ఎన్నికల పరిస్థితి మారిందంటూ వస్తున్న వార్తలకు ఇటీవల రాయలసీమలోని సిద్ధం సభ సక్సెస్ తో అన్ని రూమర్లకు సైతం చెక్ పెట్టేశారు వైసీపీ పార్టీ. ముఖ్యంగా గత ఏడాది పట్టుభద్రుల ఎమ్మెల్సీ విషయంలో కూడా వైసిపి పార్టీ ఓడింది.. అటు కీలక నేతలు సైతం పార్టీని వీడుతున్నారని జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులు సీట్లను మార్చడంతో ప్రతిపక్ష పార్టీతో చేతులు కలుపుతున్నారని ఈ క్రమంలోనే రాయలసీమలో వైసీపీ పార్టీ గ్రాఫ్ చాలా తగ్గిపోయిందని వార్తలు వినిపించాయి. వీటితోపాటు వైసీపీ కుటుంబంలో చీలికలు కూడా మొదలయ్యాయని వార్తలైతే వినిపించాయి.


అయితే వీటన్నిటికీ మించి ఇటీవలే రాయలసీమలో నిర్వహించిన సిద్ధం సభ తో ఒక్కసారిగా ఇలాంటి వార్తలని పటాపంచలు చేశాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయంగా తెలుపుతున్నారు.. అయితే అక్కడికి వచ్చిన లక్షలాదిమంది జనాలను చూసి అటు సోషల్ మీడియాలో సైతం రాప్తాడు సభ భారీ ట్రెండింగ్ అయింది. ఈ సభను చూసిన చాలామంది ప్రతిపక్ష నేతలు గుండెలలో భయాలు కూడా పుడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం సిద్ధం సభలో చేస్తున్నటువంటి ప్రసంగాలు సైతం వైసీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తమ గ్రాఫ్ తగ్గలేదని రాయలసీమలో కూడా తగ్గలేదని ప్రజలు వైసిపి పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: