సరదాగానే అన్నా ఇపుడు నారా భువనేశ్వరి అన్నమాటలే సోషల్ మీడియాతో పాటు మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలు, క్యాడర్ తో సమావేశమైనపుడు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు బదులుగా తాను కుప్పంలో పోటీచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు చెప్పారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే

‘కుప్పంకు వచ్చాను..ఇక్కడ నాకు ఒక కోరికుంది. నా మనసులో ఎప్పటినుండో ఈ కోరికుంది. నేనేమి మిమ్మల్ని తిట్టను కొట్టను. 35 ఏళ్ళుగా చంద్రబాబు కుప్పం ఎంఎల్ఏగా ఉన్నారు. ఇపుడు నాకు ఒక కోరికుంది. ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నాను. నేనే ఇక్కడినుండి నుల్చుందామని అనుకుంటున్నాను’ అని అన్నారు. నేతలు, క్యాడర్ సమావేశంలో ఆమె సరదాగానే అన్నా అదే ఇపుడు బాగా వైరల్ అయిపోయింది. దీనికి నేపధ్యం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీచేయరనే ప్రచారం జరుగుతుండటమే.

కుప్పంలో పోటీచేస్తే ఓటమి తప్పదనే భయం వెంటాడుతున్న కారణంగానే చంద్రబాబు మరో సేష్ సీటును చూసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపధ్యంలోనే భువనేశ్వరి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ముఖ్యమంత్రి నియోజకవర్గంగా పాపులర అయిన కుప్పం అంతగా డెవలప్ అయితే కాలేదు. మామూలుగా ఏ ముఖ్యమంత్రయినా తన నియోజకవర్గాన్ని, జిల్లాను డెవలప్ చేసుకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం కుప్పంను కాని చిత్తూరు జిల్లాను కాని పెద్దగా డెవలప్ చేసిందిలేదు.

చివరకు కుప్పంను మున్సిపాలిటిగా, రెవిన్యు మండలంగా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డే. సాగు, తాగునీళ్ళు ఇస్తున్నది కూడా జగనే. తనను తాను ప్రపంచ విజనరీల్లో ఒకడిగా చెప్పుకునే చంద్రబాబు  37 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణంలో రోడ్లు కూడా సరిగా వేయించలేదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ సమయంలో భువనేశ్వరి మాటలు హాట్ టాపిక్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: