అనంతపూర్ జిల్లాలోని నియోజవర్గాలలో గుంతకల్లు నియోజవర్గం ఈసారి మరింత ఆసక్తి పోరు జరగనుంది.. ముఖ్యంగా టిడిపి తరఫున మాజీమంత్రి గుమ్మనూరు జయరాం బరిలో నిలువగా వైసిపి పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా రైల్వే ఉద్యోగులు  ఎక్కువగానే ఉన్నారట. ఈ నియోజకవర్గంలో మొత్తం మీద 2,52,352  ఉన్నారు.. రైల్వే ఉద్యోగస్తులతో పాటు అక్కడ క్రిస్టియన్ జనాభా కూడా చాలా అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది.టిడిపి పార్టీ నుంచి 2009 లో గుంతకల్లు నియోజకవర్గం లో జితేంద్ర గౌడ్ పైన కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ గుప్త విజయం సాధించారు.. అలాగే 2014లో జితేందర్ గౌడ్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ నేత మధుసూదన్ గుప్తాను ఓడించి మరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీలోకి చేరిన వై వెంకటరామిరెడ్డి.. జితేందర్ గౌడ్ పైన గెలిచారు. అయితే ఈసారి టిడిపి నేత చంద్రబాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని జితేంద్రను పక్కనపెట్టి మరి జయరాంకు టికెట్ ఇవ్వడం జరిగింది.
గుంతకల్లు నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థిగా జయరాం పేరును ప్రకటించినప్పటి నుంచి అక్కడ టిడిపిలో అసంతృప్తులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తో పాటు పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు కూడా జయరాం టిడిపి పార్టీలోకి రావడానికి వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం పైన అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నప్పటికీ కొంతమంది జయరాంకు సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వైసిపి అభ్యర్థి అయిన వెంకట్రామిరెడ్డి తన నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు జగన్ సర్కార్ అందించినటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలలోకి తీసుకువెళ్తూ  మరొకసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. గతంలో వైసిపి పార్టీలో ఉన్న జయరాం టిడిపి పార్టీలోకి చేరడంతో పలువురు నేతలు కార్యకర్తలు జయరాం కు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈసారి గుంతకల్లు నియోజవర్గంలో  విజయం ఎవరిని వరిస్తుందంటూ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: