ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన పోలింగ్ జరగబోతోంది. దీంతో ఇప్పటికే నియోజవర్గాల వారీగా  నామినేషన్లు కూడా అభ్యర్థులు వేస్తూ ఉన్నారు. ఈనెల 25న నామినేషన్ చివరి తేదీగా తెలుస్తోంది. ఈసారి ఎన్నికలలో గెలుపు కోసం అటు వైసిపి ఇటు టిడిపి హోరా హోరీగా పోరాడుతున్నాయి. ఈసారి ఎన్నికలు ఇద్దరు రాజకీయ నేతలకు సైతం కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే సునామి అంటూ తుఫాను అంటూ భూకంపం అంటూ ఒక కురుక్షేత యుద్ధాన్ని సైతం తలపించేలా మాట్లాడుతూ ఉన్నారు జగన్, చంద్రబాబు


ఇటీవల చంద్రబాబు విజయనగరం జిల్లాలో ప్రజా గళం సభలో రాబోయేది తుఫానే అంటూ హెచ్చరిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు ఎన్నో తుఫాన్లు అయితే చూశారు కానీ మే 13న రాబోయే తుఫానులో కచ్చితంగా వైసీపీ పార్టీ కొట్టుకుపోతుంది అంటూ చంద్రబాబు అన్నారు.. అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వైసిపి ఓడిపోవాలని నినాదాన్ని కూడా తెలియజేశారు. ఇటీవలే శృంగవరపు కోటలో జరిగిన ప్రజా గళం సభలో చంద్రబాబు ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యంగా వైసిపి పార్టీ పైన తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో సరైన న్యాయం చట్టం లేదంటూ జగన్ ఒక సైకో అంటూ ఎద్దేవ చేశారు.


ఇలా మొత్తం మీద చంద్రబాబు తన ప్రసంగంతో జగన్ మీద విమర్శలు చేయడంతో పాటు మే 13న తుఫాను అంటూ చెప్పేశారు.. దీంతో వైసీపీ నేతలు సైతం ఆయన చెప్పినట్లుగానే మే 13న రాజకీయ తుఫాను రావడం ఖాయమే.. కానీ అయితే ఆ తుఫానులో కొట్టుకుపోయేది వైసిపి పార్టీ అని చంద్రబాబు ఆశపడుతున్నారు.. కానీ అది టిడిపినే అంటూ వైసీపీ నేతలు గట్టి కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబు మనసులో మాటని ముందుగానే జనాలకు చెప్పి సెల్ఫ్ హిప్నటైజేషన్ చేయాలని చూస్తున్నారు.. కేవలం వైసీపీ పోయి ఆయన రావాలని చెబుతున్నారు.. మే 13న తుఫానులో నిలిచేది ఎవరు కొట్టుకుపోయేది ప్రజలే తేలుస్తారని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: