ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మెగా కుటుంబం సైడు జబర్దస్త్ సెలబ్రిటీలంతా కూడా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నానా తంటాలు  పడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీలలో పోలిస్తే పిఠాపురంలోనే జనసేన పార్టీకి చాలామంది సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు.. మరొకవైపు అదే షోలో జడ్జిగా కనిపించినటువంటి రోజా వైసిపి ప్రచారాలలో వారిపైన పలు రకాల విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా వాటిపైన కిరాక్ ఆర్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.


జనసేన సపోర్ట్ ను రోజా విమర్శిస్తున్నారని వాటిపైన తన స్పందన ఏంటి అంటూ ఆర్పీని అడగగా.. ఎవరైనా మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటాము గౌరవించకపోతే రోజా అంటాము.. రోజా ఏం మాట్లాడింది ఆది నేను ఇలా కొంతమంది చిన్నచిన్న ఆర్టిస్టులు అంట ఆమెమో నేషనల్ అవార్డు ఆర్టిస్ట్ ..ఆ యువరానికి ఏమైనా 10 నేషనల్ అవార్డులు 10 ఆస్కార్ అవార్డులు వచ్చాయి అంటూ  కిరాక్ ఆర్పీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉండడం వల్లే చేశారంటూ కూడా వెల్లడించారు కిరాక్ ఆర్పి..


ముఖ్యంగా గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్లలు  నీ జీవితంలో నువ్వు చేయగలవా సుదీర్ మ్యాజిక్ షో చేసుకుంటూ పైకి వచ్చారు అతడు హీరో అయ్యాడు అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు ఉందా అంటూ కూడా ఎద్దేవా చేశారు. హైపర్ ఆది వచ్చే జబర్దస్త్ చరిత్రని మార్చాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బ్రతుకు ఎంత అంటూ ఎద్దేవా చేశారు.. ఏడు మంది హీరోలు ఉన్నారంటున్నావు కదా.. మీ జగనన్న వెనుక 70 మంది రౌడీలు ఉన్నారు ఎదిరించి చూడు నిన్నే లేపేస్తారేమో అంటూ తెలియజేశారు. ప్రతి చిన్న విషయానికి నీలా దిగజారిపోయి బ్రతుకుతారా అనుకున్నావా అంటూ రోజా పైన ఆర్పి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో కూడా వైరల్ గా మారుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: