ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం ఎన్నికల హాట్ టాపిక్ మారుతూ ఉన్నాయి.. ముఖ్యంగా ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేగా వంగా గీత.. మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ కూటమి తరుపున పోటీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం ఎన్నికలు గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా సినీ సెలబ్రిటీలను తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ కు ప్రచారం కూడా చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత మెగా కుటుంబం పైన పలు వ్యాఖ్యలు చేసింది. మెగా కుటుంబంతో తనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలియజేసింది. చిరంజీవి అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం కూడా ఉందని తెలియజేశారు.


రాజకీయాలు పక్కన పెడితే మెగా కుటుంబ సభ్యులు అంటే తనకు చాలా గౌరవం అన్నట్లుగా కూడా తెలియజేసింది. అలాగే వాళ్లకు కూడా తన పట్ల మంచి గౌరవం ఉందని వంగా గీత వెల్లడించింది. అందువల్లే పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపైన ఎలాంటి వ్యక్తిగత విమర్శలు కూడా చేయలేదని తెలిపింది.. ఏపీ ఎన్నికల బరిలో పిఠాపురం లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ పిఠాపురంలో వైసీపీ పార్టీ గెలిస్తే వంగా గీత కు డిప్యూటీ సీఎం ఇస్తానని జగన్ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు.


అందుచేతనే ఈసారి మరింత ఉత్కంఠంగా పిఠాపురం ఎన్నికలు మారాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించాయి. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం పైన క్లారిటీ చెప్పలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన బయట భారీగానే బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సీట్ల విషయం పైన కూడా కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఎవరు గెలుస్తారనే విషయం జూన్ 4వ తేదీ తెలుస్తుంది. మరి ప్రజలు ఎవరిని సీఎంగా ఎంచుకుంటారా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: