ఆంధ్రప్రదేశ్ పోలింగ్ వేల చోటు చేసుకున్న అనూహ్యపరిణామాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.. ముఖ్యంగా గెలుపు పైన భారీ ఆశలు పెట్టుకున్న అభ్యర్థులను మరొకసారి కొత్త పెన్షన్ మొదలవుతోంది. జనసేన ఎన్నికల ముందు సింబల్ విషయంలో కూడా చాలా ఆందోళన పడ్డారు. పోలింగ్ విషయంలో కూడా ఆ పార్టీ నేతలు మరోసారి ఆందోళన పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి జిల్లాలలో పోటీ చేస్తున్న కొంతమంది జనసేన అభ్యర్థులలో ఈ ఆందోళన చాలా స్పష్టంగా కనిపించింది..


జనసేన ఏపీలో 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసింది. మొదట జనసేన సింబల్ గ్లాస్ ఫ్రీ సింబల్గా ప్రకటించారు.. ఆ తర్వాత జనసేన న్యాయపోరాటం చేయడం వల్ల ఫలితంగా జనసేన పోటీ చేసి నియోజక వర్గాలలో పార్లమెంట్ పరిధిలో మరి ఎవరికి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం తెలియజేసింది. అయితే గుర్తుపైన జనసేన నేతల్లో అప్పట్లోనే ఆందోళన కనిపించింది. తెలంగాణలో బీఆర్ఎస్ గుర్తు కారుతో పోలివున్న  పడవ గుర్తు ఆ పార్టీ ఎన్నికలలో రావలసిన ఓట్లను కూడా దెబ్బేసినట్లు తెలుస్తోంది.దీంతో ఫలితాలు కూడా తారుమారయ్యాయి.


ఎన్నికల ముందు జనసేన నేతలు తమ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బకెట్ గుర్తు లేకుండా చూడాలని కోరుకున్నారు.. స్వతంత్ర అభ్యర్థులను బకెట్ గుర్తుతో పోటీ చేయడం జరిగింది..తూర్పుగోదావరిలో ఒక కీలక నియోజవర్గం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మొత్తంగా ఫలితాన్ని నిర్దేశించే విధంగా మారిపోయినట్టుగా తెలుస్తోంది.. వైసీపీ, జనసేన మధ్య హోరా హోరిగా  మారిన ఈ ఎన్నికలు ఇరువురు పార్టీల అభ్యర్థులు గెలుపు పైన చాలా ధీమాతో ఉంటున్నట్లుగా సమాచారం.


పోలింగ్ కేంద్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పోలైన ఓట్లను పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అదేమిటంటే గాజు గ్లాస్ కి వేయవలసిన ఓట్లు బకెట్ కు పోలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాము మెజారిటీతో గెలుస్తామని చెబుతున్న ఓట్ల స్థానంలోని బడ్జెట్ గుర్తు ఓట్లు ఎక్కువగా పోలైనట్లుగా సమాచారం.. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు కౌంటింగ్ మరింత ఉత్కంఠను పెంచేలా కనిపిస్తోంది. మరి జనసేన ఆశలపైన నీళ్లు చల్లుతుందేమో బకెట్ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: