ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది అంటే అనేక సర్వేల సంస్థలు సర్వేలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇక గతంలో ఆ సర్వే సంస్థల ఇచ్చిన రిపోర్టు వచ్చిన రిజల్ట్ దాదాపుగా సరి సమానంగా ఉన్నట్లు అయితే ఆ సర్వే సంస్థలపై జనాలు భారీ నమ్మకాలను పెట్టుకుంటూ ఉంటారు. దానితో ఎప్పుడెప్పుడు ఆ సంస్థల వారు తమ సర్వే రిపోర్ట్ ను విడుదల చేస్తారా..? అందులో ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అని జనాలలో కూడా ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక మంది సర్వే చేసే సంస్థలను మెయింటైన్ చేస్తున్నారు.

అందులో కొన్ని సర్వేల సంస్థలకు మాత్రమే మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాగన్న సర్వేకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన గతంలో అనేక ఎన్నికలకు సర్వేలను నిర్వహించారు. అందులో భాగంగా ఈయన చేసిన సర్వేలు , అందుకు అతను ఇచ్చిన రిపోర్టులు వచ్చిన రిజల్ట్ లు దాదాపు దగ్గరగా ఉండడంతో ఈయన సర్వే పై జనాలు ఎంతో నమ్మకాన్ని చూపిస్తూ ఉంటారు. దానితో ఈయన సర్వే ఎప్పుడు వస్తుందా అని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

ఇకపోతే తాజాగా నాగన్న కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలకు సంబంధించి మరికొన్ని రోజుల్లో రాబోయే రిజల్ట్ కు సంబంధించి తన అంచనాను వ్యక్తపరిచారు. తన అంచనా ప్రకారం ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ 96 స్థానాలను కచ్చితంగా గెలుస్తుంది అని , నేక్ టు నేక్ ఫైట్ మధ్య మరో 22 స్థానాలు గెలుస్తుంది అని , మొత్తం 118 సీట్లు అవలీలగా గెలుస్తుంది అని నాగన్న అంచనా. ఇక కూటమి 46 స్థానాలను ఈజీగా గెలుస్తుంది అని , 3 స్థానాలలో నేక్ టు నేక్ ఫైట్ మధ్య గెలుస్తుంది అని మొత్తంగా కూటమి 49 స్థానాలను గెలుపొందుతుంది అని నాగన్న అంచనా. ఇక మరో 8 స్థానాలలో మాత్రం భారీ ఫైట్ ఉండబోతుంది అని , అందులో విజయం అంచనా వేయడం కష్టం అని దానిని జనాలు డిసైడ్ చేయవలసిందిగా ఉన్నట్లు నాగన్న అంచనా వేశారు. మరి ఈయన అంచనా ఏ మాత్రం నిజం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap