- అధికారం తలకెక్కించుకోవద్దంటూ పవన్, బాబు

- కక్ష సాధింపుకు రెడీగా ఉన్న కూటమి శ్రేణులు..

- బాబోరి గిరిని దాటే ధైర్యం చేస్తారా

( ఏపీ - ఇండియా హెరాల్డ్ )

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అఖండ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే నేడు 11: 27 గంటలకి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇక డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ కు దక్కే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది. అయితే ఇక చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి ముందు ఉన్న అతిపెద్ద సవాలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం అదే సమయంలో జగన్ ప్రభుత్వం ఆదమరిచిన అభివృద్ధిని చేసి చూపించడం.


 అయితే ఇది మాత్రమే కాదు బాబోరి ప్రభుత్వం ముందు ప్రస్తుతం మరో సవాలు కూడా ఉంది. అదే పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు నేతలు అందరిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం.  అంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసిన దానికి కక్ష సాధింపు చర్యలు కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగించాలని కూటమి ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోయే పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెబుతున్నారు  కక్ష సాధింపు చర్యలు వద్దు అని హుందాగా చెబుతున్నారు. కానీ ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా. బాబోరు గీసిన గిరిని అటు మిగతా ఎమ్మెల్యేలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు దాటకుండా ఉంటారా అన్నదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్న.


 ఎందుకంటే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎంతలా ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాకు ఒక టైం వస్తుంది.. మా పార్టీ అధికారంలోకి రాని అప్పుడు అంతకు అంతా చూపిస్తాం అని టీడీపీ పార్టీ శ్రేణులు అందరూ  రివేంజ్ తీర్చుకోవడానికి ఎంతో కసితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రాలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక ఇప్పుడు వచ్చిన అధికారాన్ని తలకెక్కించుకోకుండా.. చిత్తశుద్ధితో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలి తప్ప.  కక్ష సాధింపు చర్యలు వద్దు అని చంద్రబాబు చెబుతున్న.. ఆయన గీసిన గిరిని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు దాటకుండా ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ చంద్రబాబు కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే.. బాబుకి, జగన్ కి పెద్ద తేడా ఉండదని ప్రజలు అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: