•పప్పు అన్నారు కానీ నేడు మినిస్టర్ అయ్యాడు..

•ప్రతిపక్షాలు టార్గెట్ కాదు ప్రజాపాలనే ముఖ్యం..

•లోకేష్ అసెంబ్లీలో హైలెట్ అవ్వాలంటే యువతను మెప్పించాల్సిందే..

(ఆంధ్రప్రదేశ్ - అమరావతి - ఇండియా హెరాల్డ్)అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.. నిన్న ముఖ్యమంత్రి,  ఉపముఖ్యమంత్రి , మంత్రులు,  ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు స్పీకర్ కూడా నియమింపబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలనే ధ్యేయంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో సమావేశాలు కూడా ప్రజల కష్టాలను తెలుసుకొని వారి ఇబ్బందులను తీర్చే దిశగా ఉండాలని.. ప్రజల సైతం కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాబోయే ఐదు సంవత్సరాలలో కూటమి హవా కొనసాగించడమే కాదు ప్రజల సమస్యలను తెలుసుకొని మరీ వాటిని తీర్చే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా టిడిపి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా పిలవబడుతున్న నారా లోకేష్.. ప్రస్తుతం ఐటీ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు.. గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు పాదయాత్రలో భాగంగా ఎంతోమందిని ఆయన పరామర్శించి వారి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎన్నో అవమానాలను కూడా భరించాల్సి వచ్చింది. చాలామంది సుద్ధ పప్పు అని.. వీడికి తెలుగు రాదు అని.. చంద్రబాబు వారసుడిగా రాజకీయానికి ఏ మాత్రం పనికిరాడు అంటూ చాలామంది రకరకాల కామెంట్లు చేశారు.. అలాంటి నారా లోకేష్ ఇప్పుడేకంగా 90 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరిలో శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.. ఎమ్మెల్యేగా గెలుపొంది ఏకంగా మినిస్టర్ పదవిని చేపట్టారు నారా లోకేష్.

ఇక యువతరానికి ఈయన ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు.. మరి అసెంబ్లీలో హైలెట్ అయ్యి ప్రజలను మెప్పించాలి అంటే ఈయన తాను చేపట్టిన శాఖకు సంబంధించి పనులను నిర్వర్తించడమే కాదు యువతకు,  నిరుద్యోగులకు సరైన మార్గం చూపించాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా యువతను చైతన్యవంతులుగా మార్చి నిరుద్యోగులకు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి.. ముఖ్యంగా ఉద్యోగం కావాలి అంటే ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ సాఫ్ట్వేర్ కావాలంటే బెంగళూరు , హైదరాబాద్ వెళ్లాల్సిందే అంటున్నారు. ఇకపై విజయవాడ,  విశాఖపట్నం అనేలా ఐటీ హబ్స్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా యువత కోసం నిరుద్యోగుల కోసం పిల్లల కోసం కూడా ఆయన పోరాడాలి. అసెంబ్లీలో ఈ అంశాలను హైలెట్ చేస్తూ మాట్లాడితే కచ్చితంగా నారా లోకేష్ అసెంబ్లీలో హైలెట్ అవుతారు ఇక ఈయన దెబ్బకి ప్రతిపక్షాలు అబ్బా అనేలా తన పరిపాలన చూపించాలని ప్రజల సైతం కోరుకుంటున్నారు. ఇక నారా లోకేష్ కష్టపడి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలను ఏ విధంగా తన పరిపాలనతో మెప్పిస్తారో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: