మంత్రులు వ‌ర్సెస్ మంత్రులు.. ఈ విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. వైసీపీలోనూ మంత్రు లుగా చాలా మంది ప‌నిచేశారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెండు విడ‌త‌లుగా మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిం చారు. దీనిలో 40 మంది వ‌ర‌కు మంత్రులుగా చేశారు. అయితే.. వారంతా కూడా.. నోటికి ప‌ని చెప్ప‌డంలో స్వేచ్ఛ‌ను అనుభ‌వించారు. మంత్రులు కొడాలి నాని, రోజా, అంబ‌టి రాంబాబు, పేర్నినాని, గుడివాడ అమ‌ర్నాథ్‌, సీదిరి అప్ప‌ల‌రాజు,. జోగి ర‌మేష్‌.. ఇలా అనేక మంది తమ నోటికి ప‌ని బాగానే చెప్పారు.


కానీ, త‌మ త‌మ శాఖ‌ల‌కు మాత్రం ప‌నిచెప్ప‌లేక పోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. నిజానికి ఒక్క మంత్రికి కూడా.. త‌మ శాఖ‌ల‌పై ప‌ట్టు ల‌భించ‌లేదంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. కానీ, నిజం. రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. కూడా పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను ఎలా తీర్చిదిద్దాల‌నే విష‌యంపై కొడాలి నానికి దిశానిర్దేశం లేదంటే.. ఆశ్చర్యం వేసింది.ఇ క‌,హోం శాఖ మంత్రులుగా చేసిన‌.. సుచరిత‌, వ‌నిత‌ల‌కు కూడా.. ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇద్ద‌రూ కూడా.. ఎప్పుడూ ఒక్క‌సారి కూడా డీజీపీ ఆఫీసులో కి అడుగు పెట్టేందుకు అవ‌కాశం రాలేదు.


అలానే.. ప‌ర్యాటక శాఖ మంత్రిగా రోజా ఉన్నా.. అంత‌కు ముందు అవంతి శ్రీనివాస‌రావు ప‌నిచేసినా.. ఒక్క ప్రాజెక్టును తీసుకురావడంలో ఇద్ద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. అంటే..ఆ మంత్రులు కేవ‌లం నోటికి ప‌నిచెప్పారే త‌ప్ప‌.. నోటికి స్వేచ్ఛ‌ను క‌ల్పించుకున్నారే త‌ప్ప‌.. ప‌నితీరులో మాత్రం స్వేచ్ఛ‌ను రాబ‌ట్టుకోలేక పోయారు. ప‌నితీరును మెరుగు ప‌రుచుకోలేక పోయారు. ఒక్క‌రోజు కూడా.. స‌చివాల‌యానికి వెళ్లిన మంత్రులు లేరంటే.. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు హ‌యాంలో టీజీ భ‌ర‌త్‌, వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య‌కుమార్ యాద‌వ్ వంటి నూత‌న మంత్రులు ఉన్నారు.


వీరు కూడా.. త‌మ నోటికి ప‌ని చెబుతారా?  లేక‌.. స్వేచ్ఛ‌గా త‌మ ప‌నితీరును మెరుగు ప‌రుచుకుంటారా? అనేది చూడాలి. లేక‌పోతే.. గ‌తంలో మాదిరిగా.. వారు కూడా.. నోటికి స్వేచ్ఛ‌కు క‌ల్పించుకున్న నాయ‌కు లుగానే ముద్ర పడిపోయే అవ‌కాశం ఉంది. నిజానికి అప్ప‌టికి ఇప్ప‌టికి కొంత తేడా ఉంది. అప్ప‌టి సీఎం మాట‌ల ను బ‌ట్టి..నోటి దూల‌ను బ‌ట్టి మంత్రుల‌కు మార్కులు వేశారు. కానీ, చంద్ర‌బాబు ప‌నితీరుకు ప‌ట్టం క‌డ‌తార‌నే పేరుంది. ఈ నేప‌థ్యంలో స్వేచ్ఛ విష‌యంలో మంత్రులు నోటికి కాకుండా.. చేత‌ల‌కు స్వేచ్ఛ తీసుకుంటే మెరుగ్గా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: