ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి తన అపోజిషన్ పార్టీ నేతలతో ఇక్కడ నా వెనకాల ఉన్న అక్కలు నాకు చెప్పి చెప్పి ఇక్కడ మునిగి అక్కడ పేలిండ్రు. ఇక వారి మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవడమే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు.
ఇక దానితో బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి మీరు అన్నది నన్నే. ఎందుకు నాపై ఇంత కక్ష కట్టారు. నేను ఏమి తప్పు చేశాను. ప్రతిసారి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని గట్టిగా ప్రశ్నించింది. అలాగే నేను ఆ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని కోరుకున్నాను. నువ్వు ఈ పార్టీలోకి వస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది.. నువ్వు గొప్ప స్థాయికి వెళతావు అని నేనే ఆ రోజు ఆయనకి చెప్పాను.
అలాగే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వచ్చిన తర్వాత ఆయన అద్భుతమైన స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా ఆశీర్వదించాను. అంత మనస్ఫూర్తిగా నేను ఆయన ఎదుగుదల కోరుకుంటే ఇప్పుడు నన్ను ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడు. నాకు అసలు అర్థం కావడం లేదు. ఆడవాళ్ళను నమ్మొద్దు ముంచుతారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.
మేము ఏం నమ్మించాం... ఏం మోసం చేశాం చెప్పండి అని అడుగుతూ అసెంబ్లీలో కంటనీరు పెట్టింది. ఇక దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ... సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరు నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఆమె నాకు చెప్పింది. ఆ పార్టీలో కొనసాగితే నువ్వు గొప్ప స్థాయికి వెళతావు అని తన తమ్ముడికి చెప్పిన మాధురి నాకు ఆమె చెప్పింది.
నేను కూడా తనను సొంత అక్క మాదిరిగానే అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇక ఆ తర్వాత నేను 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాను. ఆ తర్వాత 2019లో మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేయాలి అనుకున్న సమయంలో మొదట నాకు సపోర్ట్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లి సబితా ఇంద్రారెడ్డి అక్కడ మంత్రి పదవి పుచ్చుకుంది.
ఇది నమ్మించి మోసం చేయడం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఇలా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రేవంత్ రెడ్డి , సబితా మధ్య జరిగిన మాటల యుద్ధంలో బాగంగా సబిత ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకుంది.