జగన్ కు ఘోర పరాజయం రుచి చూపించి కలలో కూడా పవన్ కళ్యాణ్ గుర్తు వచ్చేలా చేశారు. ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ నేతలు జనసేనలోకి జంప్ చేసి ఎమ్మెల్యేలు.. ఎంపీలు అయ్యారు. వంశీకృష్ణ శ్రీనివాస్ - వల్లభనేని బాలశౌరి వీరు వైసీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యే.. ఎంపీ అయినవారే. ఈ క్రమంలోనే పవన్ ఎన్నికల తర్వాత కూడా వైసిపిని పూర్తిగా ఖాళీ చేసేందుకు నడుం బిగించినట్టే కనిపిస్తోంది. విశాఖపట్నంలో వైసీపీకి - జనసేన షాకుల మీద షాక్కులు ఇస్తుంది. ఎన్నికలకు ముందే ఆ పార్టీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లి ఎమ్మెల్యే అయ్యారు.
అలాగే ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీకి చెందిన ఐదుగురు ఐదుగురు కార్పొరేటర్ల తో పాటు గ్రేటర్ విశాఖ పట్నంలోని పలువురు కీలక వైసిపి నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వీరికి కండువాలు కప్పి తమ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అధిక స్థానాలు గెలుచుకుంటుందని పవన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ దూకుడు చూస్తుంటే విశాఖపట్నంలో వైసీపీని పూర్తిగా ఖాళీ చేసేలా కనిపిస్తున్నారు.