వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో... తీవ్ర వివాదం నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే నేపంతో... ఆయన కూతుర్లు నిరసనకు దిగారు. గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు... నాన రచ్చ చేశారు ఆయన కూతుర్లు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. అయితే కుటుంబ సమస్యలు అలాగే నియోజకవర్గ సమస్యల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్... టెక్కలి నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది.


అది కూడా టిడిపి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు అచ్చం నాయుడు చేతిలో... వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. భారీ మెజారిటీతోనే అచ్చం నాయుడు ఇక్కడ విజయం సాధించారు. అయితే... టెక్కలి నియోజకవర్గాన్ని.. దువ్వాడ శ్రీనివాస్ కు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి... ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే... దువ్వాడ శ్రీనివాస్ కు  టికెట్ ప్రకటించారు.


ఆ సమయంలో...  దువ్వాడ శ్రీనివాస్ భార్య... దువ్వాడ వాణి... తన భర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి.. తనకి టికెట్ ఇవ్వాలని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీను నమ్మి... ఆయనకు టెక్కలి టికెట్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా వాణి వేయడం జరిగింది. కానీ వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి తో పాటు ఇతర నేతలు... దువ్వాడ వాణితో మాట్లాడి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు.

 

అయితే ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వేరు కాపురం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కవరం వద్ద కొత్త ఇంటిని నిర్మించుకొని.. వేరే మహిళతో కలిసి ఉంటున్నాడట దువ్వాడ శ్రీనివాస్. అయితే ఈ విషయం తెలియగానే ఆయన కుమార్తెలు... గురువారం అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు... ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోలేదని... కానీ తమ తండ్రి.. వేరే మహిళతో ఉంటున్నాడని మండిపడ్డారు.  అయితే అర్ధరాత్రి కూతుళ్లు ఆందోళన చేసిన కూడా అందువల్ల శ్రీనివాస్... పట్టించుకోలేదట. ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: