ముఖ్యమంత్రి చంద్రబాబు , ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది .. ఈ క్రమంలోనే హస్తకాల శాఖ మంత్రి ఎస్ . సునీత ఈ పరిశీలనలో పాల్గొని ఈ పార్కు నిర్మాణానికి సంబంధించిన సమీక్షను తాజాగా నిర్వహించారు .. అలాగే ఈ పార్కును మొత్తంగా 10.80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది .. అందుకు అనుగుణంగానే అధికారులతో కలిసి మంత్రి సునీత ఈ ప్రణాళిక పై సమీక్షను పూర్తి చేశారు. మంగళగిరి నేతన్నలు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి , అమ్మకాలు నిర్వహించుకోవడానికి , శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు ఈ పార్క్ ఎంతో ఉపయోగపడనుంది .. అలాగే ఏపీ ప్రభుత్వం తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది .. అదేవిధంగా ఆధునిక సదుపాయాలతో నేతన్నలకు నిరంతర ఉపాధి అందించే విధంగా ఈ నిర్మాణ పనులను మొదలు పెట్టబోతున్నారు ..
దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రదర్శన హాల్లో మార్కెటింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని అధికారులకు ప్రణాళికలు రేడి చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడుగునా 365 రోజులు నేతన్నలకు పని ఉండేలా చర్యలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు .. గత వర్షాకాలంలో మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల చేనేత కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉండేది .. అయితే ఈ మెగా పార్కు ద్వారా సంవత్సరం మొత్తం ఉపాధి ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది.. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంగళగిరి రూపులేఖలు దాదాపు మారిపోతున్నాయి .. ఇప్పుడు మంగళగిరి చేనేత వస్త్రాలకు కూడా అంతర్జాతీయంగా బ్రాండింగ్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మంగళగిరి ఖ్యాతిని మరింత పెంచే విధంగా కృషి చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి