
ఈ కేసులో ఏ5 నిందితుడిగా విజయసాయిరెడ్డి పేరు ఉండటం ఒకింత సంచలనం అవుతోంది. అయితే ఇప్పటివరకు విజయసాయిరెడ్డి సపోర్ట్ తో వైసీపీ నేతలకు చుక్కలు చూపించేలా కూటమి సర్కార్ అడుగులు వేస్తోందని వార్తలు వినిపించాయి. అయితే తననే నిందితునిగా చేర్చడం గురించి విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారనే చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం.
అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను ఒక్క రూపాయి కూడా ముట్టలేదని దొరకని దొంగలు, దొరికిన దొంగలు తన పేరు చెబుతున్నరని వెల్లడించినట్టు తెలుస్తోంది. లిక్కార్ దొంగల మిగతా బట్టలు విప్పేందుకు తాను సహకరిస్తానని విజయసాయిరెడ్డి చెప్పినట్టు సమాచారం. అయితే విజయసాయిరెడ్డి స్పందన విషయంలో ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
లిక్కర్ దొంగల జాబితాలో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉండటం ఒకింత చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసు వల్ల రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డికి ఇబ్బందులు తప్పవని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండి ఉంటే బాగుండేదని ఈ విషయంలో ఆయన తప్పు చేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడిన తర్వాత విజయసాయిరెడ్డికి సైతం అనుకూలంగా పరిస్థితులు లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. భవిష్యత్తులో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే విజయసాయిరెడ్డికి మరిన్ని ఇబ్బందులు తప్పవని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి మరో రాజకీయ పార్టీలో చేరతారేమో చూడాల్సి ఉంది.