ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణకృష్ణంరాజు (RRR) చుట్టు వివాదాలు సైతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పైన సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తూ ఉన్నట్లుగా వినిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణంరాజుకు ఉండి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో బీజేపీ నుంచి ఎంపీ  కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని చివరి నిమిషం కూటమి వాళ్ళ మారిన పరిణామాల రిత్య నరసాపురం ఎంపీ టికెట్లు భూపతి రాజుకు కేటాయించడం జరిగింది.


RRR కు  ఎమ్మెల్యే సీట్లు పిలిచి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గతంలో వైసీపీ పార్టీ పైన పోరాడడంతో పాటుగా కూటమికి అనుకూలంగా మాట్లాడడంతో ఎన్నికల ముందు ఉండి టికెట్ ని ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఆయనను కాదని మరి రఘురామకు అవకాశాన్ని కల్పించారు. దీంతో అప్పటి నుంచి అక్కడ టిడిపిలో కొంతమేరకు అసహనం కూడా నెలకొంది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన రఘురామ అందరిని కూడా కలుపుకొని మీటింగులు పెట్టి పార్టీలో వారందరిని కూడా బుజ్జగించి విభేదాలు లేకుండా చూసుకున్నారు.


కానీ ఓటమి అధికారం చేపట్టి డిప్యూటీ స్పీకర్గా పదవి చేపట్టిన తర్వాత ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయట. వినిపిస్తున్న టాక్ మేరకు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నియోజకవర్గంలో టిడిపిలో నాయకులు రెండు భాగాలుగా విడిపోయారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నాయట. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు అక్కడ జరుగుతున్న ఎలాంటి కార్యక్రమాలలో కూడా ఆహ్వానం ఇవ్వకుండా చూస్తున్నారట రఘురామ వర్గం వారు.. దీంతో రామరాజు అనుకూలంగా ఉండేవారు సైతం తమకు కూటమిలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనే విధంగా వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: