
పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ వాడుకొని మరి ఈ దాడులకు దిగినట్టుగా ఆధారాలతో సహా ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచం ముందు ఉంచిందని.. దాడికి ముందు తన ఎయిర్ స్పేస్ కూడా మూసేయమని విషయాలను కూడా తెలియజేశారు. పాకిస్తాన్ మొత్తం మీద 36 చోట్ల దాడుకు ప్రయత్నాలు చేసింది అంటు అధికారులు తెలియజేస్తున్నారు. ఇండియాలో ఉండేటువంటి నగరాలు విమానాశ్రయాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా పాకిస్తాన్ చేసుకున్నట్లు తెలియజేశారు.
కానీ ప్రతికూల దాడుల విషయంలో ఇండియా చాలా సంయమనం పాటించిందని పౌర విమానాలలో ప్రయాణిస్తున్నటువంటి విదేశీయులకు కూడా ఎలాంటి ఆపద కలుగకుండా ఉండేందుకే సైనిక అధికారులు పలు రకాల చర్యలు తీసుకున్నారు అంటూ తెలియజేస్తున్నారు. అయితే ఈ దాడి చేసిన డ్రోన్లు సైతం టర్కీ చెందినట్లుగా అధికారులు గుర్తించారట. అక్కడ ఆసీస్ గార్డ్ సోంగర్ డ్రోన్లుగా ఉన్నట్టుగా మంత్రిత్వ శాఖ అధికారులు మీడియా సమావేశంలో తెలియజేశారు. అన్ని విషయాల పైన అధికారులు క్లారిటీ ఇస్తున్నారు.