దీంతో ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ అలెర్ట్ అయింది . అంతేకాదు ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అధికారులు. అందుతున్న వివరాల ప్రకారం ఎయిర్ ఇండియా ఏఐ 379 విమానానికి బాబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది . ఈ బాంబు బెదిరింపు టెర్రరిస్టులే చేశారు అంటూ జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది .
గాల్లో ఉన్న విమానాన్ని గాల్లోనే లేపేస్తామంటూ బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్లు తెలుస్తుంది . ఈ విమానంలో సుమారు 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది . బెదిరింపు కాల్ అనంతరం ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి పూర్తిగా విమానాన్ని తనిఖీలు చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే విమానంలో ఎటువంటి అనుమానస్పద వస్తువులు దొరకలేదు అని పూర్తిగా విమానం చెక్ చేసిన తర్వాత అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ ప్రయాణికులను వాళ్ళు చేరవలసిన గమ్య స్థలానికి చేర్చే విధంగా ఎయిర్ ఇండియా పక్క సెక్యూరిటీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది . ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి