
రాజా రఘువంశీని చంపేందుకు తన భార్య సోనమ్ కిరాయి హంతకులను పంపించడమే కాకుండా చంపడానికి మూడుసార్లు ప్రయత్నించి మరి విఫలమైనట్లుగా బయటపెట్టారు అధికారులు. మొదటి ప్రయత్నం గుహతిలో హత్య చేయాలని చూశారట.. అక్కడ వీలు కాకపోవడంతో ఆ తర్వాత మేఘాలయలోని సోహ్ర లో రెండుసార్లు చంపేందుకు ప్లాన్ చేసి ఒకవేళ అక్కడ చంపితే మృతదేహం మాయం చేయడం చాలా కష్టమవుతుందని మరి వెనక్కి తగ్గారట. ఆ తర్వాత నోంగ్రీ యార్డ్ లో చంపాలని ప్రయత్నించినా కూడా అక్కడ డెడ్ బాడీ మాయం చేయడం కష్టంగా ఉంటుందని వెనక్కి తగ్గినట్లుగా నిందితులు తెలిపారు.
మరొకసారి మావ్లాకియాట్ విశావు డాగ్ మధ్య హత్య చేయాలని భావించి విఫలమయ్యారట.. ఇలా మూడుసార్లు విఫలం అవ్వడంతో ఇక నాలుగవసారి సౌవ్ డాంగ్ జలపాతం వద్ద హత్య చేశారని .. ఇక హంతకులతో కలిసి సోనమ్ కూడా తన భర్త మృతదేహాన్ని నీటిలో తోసేసేందుకు సహాయం చేసిందని నిందితులు బయట పెట్టారు. నిందితులను రిమాండ్ కి పంపించిన వారికి ఉరిశిక్ష ఖరారు చేయాలని అటు కుటుంబ సభ్యులతో పాటు నేటిజెన్సీ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన భర్తని ఇలా నాలుగు సార్లు ప్లాన్ చేసి చంపాలనుకోవడం క్రైమ్ స్టోరీ నే మించిపోయి మరి ట్విస్టులు బయటపడుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.